ఓటమి అంచుల్లోకి భారత్.. బుమ్రా దెబ్బకు చేతులెత్తేసిన పాకిస్థాన్

బుమ్రా ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అప్పటికే క్రీజులో రిజ్వాన్ పాతుకుపోయి పాక్ జట్టును గెలిపించే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు.

jasprit bumrah

IND vs PAK T20 Match : టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం రాత్రి న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లకే ఆలౌట్ అయ్యి కేవలం 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. 120 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టు ఆచితూచి ఆడుతూ 10 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 57 పరుగులు చేసి విజయం దిశగా పయణించింది. దీంతో విజయంపై టీమిండియా ఆశలు సన్నగిల్లుతూ వచ్చాయి. ఉస్మాన్ ను అక్షర్ ఔట్ చేసినప్పటికీ భారత్ శిబిరంలో ఓటమి ఆందోళన తొలగిపోలేదు.

Also Read : తక్కువ ప‌రుగుల‌కే విరాట్ కోహ్లీ అవుట్.. అనుష్క శర్మ రియాక్షన్ వైరల్

73 పరుగుల స్కోరు వద్ద రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్ఠ స్థితిలో పాకిస్థాన్ జట్టు నిలిచింది. మరో 47 పరుగులుచేస్తే విజయకేతనం ఎగురవేయడం ఖాయం. దీంతో టీమిండియా ఫ్యాన్స్ సైతం ఈ మ్యాచ్ పాకిస్థాన్ జట్టుదే అనుకున్నారు. కానీ, ఊహించని రీతిలో మ్యాచ్ మలుపు తిరిగింది. పాక్ జట్టు 29 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. జస్ర్పీత్ బుమ్రా క్రీజులో పాతుకుపోయిన రిజ్వాన్ (31) ను ఔట్ చేయడం ద్వారా ఓటమి అంచుల్లోకి వెళ్లిన భారత్ జట్టు విజయం వైపు దూసుకొచ్చింది.

Also Read : IND VS PAK : టీ20 ప్రపంచకప్.. ఉత్కంఠ పోరులో పాక్‌పై 6 పరుగుల తేడాతో భారత్ విజయం

బుమ్రా ఇన్నింగ్స్ 15వ ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అప్పటికే క్రీజులో రిజ్వాన్ పాతుకుపోయి పాక్ జట్టును గెలిపించే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు. ఆ సమయంలో బుమ్రా వేసిన తొలి బంతి మంచి లెంగ్త్ లో పడింది. తక్కువ ఎత్తులో దూసుకొచ్చిన బంతిని రిజ్వాన్ స్వీప్ చేయాలని చూడగా.. అది అతడికి చిక్కకుండా ఆఫ్ స్టంప్ ను లేపేసింది. దీంతో భారత్ శిబిరంలో సంబరాలు హోరెత్తాయి. ఆశలు వదులుకున్న మ్యాచ్ లో బుమ్రా అద్భుతాలు చేయడంతో భారత్ జట్టు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. బుమ్రా మొత్తం నాలుగు ఓవర్లు వేసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు.. మూడు కీలక వికెట్లు పడగొట్టాడు.

 

ట్రెండింగ్ వార్తలు