Afghanistan : అప్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు ఆఫీసులో తాలిబన్లు

క్రికెట్‌ను ఇష్టపడని తాలిబన్‌ నేతలు అఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించారు.

Afghanistan Cricket Board : రెండు దశాబ్దాల తర్వాత అఫ్ఘానిస్తాన్‌లో మరోమారు తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టడంతో అక్కడ క్రికెట్‌ ఆటగాళ్ల భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. సాధారణంగా క్రికెట్‌ను ఇష్టపడని తాలిబన్‌ నేతలు అఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించారు. కాబూల్‌లోని ఈ కార్యాలయంలోకి వెళ్లే సమయంలో వీరి వెంట అఫ్ఘాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్లా మజారీ కూడా ఉన్నాడు. ఏసీబీ ఆఫిస్‌ మొత్తం తాలిబన్‌ల అండర్‌లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.

Read More : Pakistan : పాకిస్థాన్ లో చైనీయులపై ఆత్మహుతి దాడి

క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే పటిష్టంగా తయారవుతున్న అఫ్ఘాన్‌ టీమ్‌ భవితవ్యం ఎంటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వచ్చిన అతి తక్కువ కాలంలోనే మేటీ జట్లను కూడా మట్టికరిపించిన చరిత్ర అఫ్ఘాన్‌ టీమ్‌ది. మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌ కప్‌ కోసం జట్టు ఆటగాళ్లు ఎప్పటినుంచో శ్రమిస్తున్నారు. అసలు టీ20 ప్రపంచకప్‌ ఆడటానికి తాలిబన్‌లు ఒప్పుకుంటారా? ఒక వేళ ఒప్పుకున్నా ఇప్పుడున్న టీమ్‌నే కొనసాగిస్తారా? అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే తాలిబన్ల రాకతో అఫ్ఘాన్‌ క్రికెట్‌కు వచ్చిన ప్రమాదమేమి లేదని అఫ్ఘానిస్తాన్‌ క్రికెట్‌ సీఈవో హమీద్‌ షిన్వరీ ఇప్పటికే క్లారిటి ఇచ్చారు.

Read More : Taliban : హైబతుల్లా ఎక్కడ ? చనిపోయాడా ?

మరోవైపు… సెప్టెంబర్ 01వ తేదీ నుంచి 05వ తేదీ వరకు శ్రీలంకలోని హంబన్ తోట వేదికగా..పాక్ – అప్ఘన్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఇటీవలే ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో…అఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు వశం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్లు మొదటి నుంచి క్రికెట్ కు వ్యతిరేకులు. ఈ నేపథ్యంలో అప్ఘన్ – పాక్ జట్ల మధ్య మ్యాచ్ పై సందిగ్ధత నెలకొంది. అయితే…ఈ సిరీస్ కు తాలిబన్లు అంగీకారం తెలిపారంటూ…పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పేర్కొనడం సంచలనమైంది.

ట్రెండింగ్ వార్తలు