Taliban : హైబతుల్లా ఎక్కడ ? చనిపోయాడా ?

అఫ్ఘాన్‌ను హస్తగతం చేసుకున్న కీలక సమయం తర్వాత కూడా ఆయన జాడ కనిపించలేదు. ఎక్కడ ఉన్నాడనే విషయంపై ఆసక్తి నెలకొంది.

Taliban : హైబతుల్లా ఎక్కడ ? చనిపోయాడా ?

Taliban chief

Taliban Chief Hibatullah : అఫ్ఘాన్‌ను హస్తగతం చేసుకున్న కీలక సమయం తర్వాత కూడా ఆయన జాడ కనిపించలేదు. దీంతో హైబతుల్లా ఎక్కడ ఉన్నాడనే విషయంపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఆయన పాకిస్థాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్నారని అంతర్జాతీయ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 60ఏళ్ల వయసు దాటిన హైబతుల్లాను తాలిబన్ల బృందంలో కేవలం సైనికుడిగానే కాకుండా రాజకీయ, మిలటరీ, న్యాయపరమైన అంశాల్లో మంచి పట్టున్న వ్యక్తిగా అభివర్ణిస్తారు.

Read More : Taliban : అప్ఘాన్‌‌లో తిరుగుబాటు, ఆ జిల్లాల్లో తాలిబన్లను తరిమికొట్టారు

తాలిబన్లకు నాయకత్వం వహిస్తోన్న ఐదారుగురు కీలక నేతల్లో హైబతుల్లా ముందున్నారు. అయితే, తాజాగా అఫ్గాన్‌ తాలిబన్ల నియంత్రణలోకి వచ్చిన తర్వాత హైబతుల్లానే పాలనా పగ్గాలు చేపడతారనే వార్తలు వచ్చాయి. కానీ ఆయన కనపించలేదు. ఇక తాలిబన్లకు సుప్రీం లీడర్లుగా వ్యవహరించే వారు బాహ్యప్రపంచానికి తక్కువగానే కనిపిస్తుంటారు. సాధారణ కార్యకలాపాలను వారి అనుచరులకు అప్పజెప్పి.. కీలక వ్యూహాలు, వ్యవహారాలను మాత్రం పర్యవేక్షిస్తుంటారు.

Read More : Yadadri Temple : యాదాద్రి ఆలయ ప్రారంభం, ముహూర్తం ఫిక్స్!

అంతకుముందు తాలిబన్ల అగ్రనేతలుగా ఉన్నవారు కూడా రహస్య ప్రదేశాల్లోనే ఉండేవారు. కనీసం వారు బతికి ఉన్నారో లేదో విషయాలు కూడా బయటకు తెలియనివ్వలేదు. తాలిబన్ల వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా ఒమర్‌ 2013లో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం తాలిబన్లకు చీఫ్‌గా వ్యవహరించిన అఖ్తర్‌ మన్సూర్‌ 2016లో అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో హతమయ్యాడు. 2016 మే నుంచి తాలిబన్‌ల సుప్రీం లీడర్‌గా హైబతుల్లా నియమితుడయ్యాడు.