Yadadri Temple : యాదాద్రి ఆలయ ప్రారంభం, ముహూర్తం ఫిక్స్!
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకటైన యాదాద్రి ఆలయాన్ని దసరా నాటికి ప్రారంభించాలనే దిశగా...ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Yadadri Temple
Yadadri Temple : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకటైన యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయాన్ని దసరా నాటికి ప్రారంభించాలనే దిశగా…ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొండపై చేస్తున్న నిర్మాణాల పనులు ఓ కొలిక్కి వచ్చాయి. గుట్ట దిగువున మాత్రం కొన్ని ప్రధాన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. వీటిని అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. దసరాకు ప్రారంభించే విషయంలో…సీఎం స్పష్టత కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.
Read More : జల వివాదం…కేంద్రంపై తెలంగాణ అసహనం
ఈ విషయంలో సీఎం కేసీఆర్…చినజీయర్ స్వామి వారితో చర్చించి..ముహూర్తం ఫిక్స్ చేయనున్నారని తెలుస్తోంది. దసరాకు ప్రారంభించడానికి కాకపోతే..వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో ప్రారంభోత్సవం చేపట్టే అవకాశం ఉంది. ఇక యాదగిరిగుట్ట పనుల విషయానికి వస్తే…క్యూ కాంప్లెక్స్ వెలుపలి భాగానికి సంబంధించి…కొన్ని పనులు కొనసాగుతున్నాయి. గుట్టపైనున్న పుష్కరిణి పనులు రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం.
Read More : Bhakti : శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, తిరుపతిలో ముగిసిన పవిత్రోత్సవాలు
దిగువన పుష్కరిణి నిర్మాణం తుది దశకు చేరుకుంది. ప్రత్యేక ఆకర్షణగా చేస్తున్న విద్యుత్ దీపాల ఏర్పాటు పది రోజుల్లో పూర్తి కానట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. దిగువన కళ్యాణ కట్ట రెండు నెలల్లో సిద్ధమౌతుందని తెలుస్తోంది. ప్రెసిడెన్షియల్ విల్లాతో పాటు…వీఐపీ కాటేజీలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో నిర్మిస్తున్నందున..చాలా జాగ్రత్తగా పనులు చేయాల్సి వస్తోందని, పనులు తొందరగా కాకపోవడానికి ఇదే కారణమని అధికారులు వివరణనిస్తున్నారు.