Tanmay Agarwal : హైదరాబాద్ బ్యాటర్ ఊచకోత.. 39 ఏళ్ల రవిశాస్త్రి రికార్డ్ బ్రేక్.. ఏకంగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన యువ క్రికెటర్

తన్మయ్ అగర్వాల్ వీరబాదుడుకు దిగ్గజ క్రికెటర్ల రికార్డులు బద్దలయ్యాయి. భారత దేశవాళీ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగానూ తన్మయ్ రికార్డు నెలకొల్పాడు.

Tanmay Agarwal

Ranji Trophy 2023-24 : హైదరాబాదీ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అందరి రికార్డులను బద్దలుకొట్టి ఏకంగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఇందులో 33 ఫోర్లు, 21 సిక్సర్లు ఉన్నాయి. తన్మయ్ ఆడుతున్నంత సేపు బౌండరీల మోత మోగింది. తన్మయ్ వీరబాదుడతో హైదరాబాద్ స్కోర్ 48 ఓవర్లలో వికెట్ నష్టానికి 529 పరుగులకు చేరింది. మొత్తం మీద 160 బంతులను ఎదుర్కొన్న తన్మయ్ 323 పరుగులు సాధించి క్రీజులో ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రికార్డుగా నమోదైంది.

Also Read : Ind vs Eng 1st Test Day 2 : ఉప్ప‌ల్ టెస్టులో ప‌ట్టుబిగించిన భార‌త్‌.. 175 ప‌రుగుల ఆధిక్యం

హైదరాబాద్ జట్టు భారీ ఆధిక్యం..
దేశవాళి ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్ మధ్య రంజీ ట్రోపీ ప్లేట్ డివిజన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన అరుణాచల్ 39.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ 48 ఓవర్లలో 529 పరుగులు చేసింది. తన్మయ్ (323), కెప్టెన్ రాహుల్ సింగ్ (185) మొదటి వికెట్ కు 449 పరుగులు జోడించడం విశేషం. తన్మయ్, రాహుల్ సింగ్ వీరబాదుడుతో హైదరాబాద్ జట్టు 357పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది. దేశవాళి ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫ్రీ లో హైదరాబాద్ జట్టు అదరగొడుతోంది. ఇప్పటికే తొలి మూడు మ్యాచ్ లలో ఇన్నింగ్స్ విజయాలు సాధించిన హైదరాబాద్ నాలుగో మ్యాచ్ లోనూ ఇన్నింగ్స్ విజయం సాధించే దిశగా పయనిస్తోంది.

Also Read : KL Rahul : అయ్యో రాహుల్ ఎంత‌ప‌నైంది.. 50వ టెస్టులో 100 మిస్‌.. అయినా ఓ రికార్డు

ఇషాన్ కిషన్ రికార్డు బ్రేక్ ..
తన్మయ్ అగర్వాల్ వీరబాదుడుకు దిగ్గజ క్రికెటర్ల రికార్డులు బద్దలయ్యాయి. భారత దేశవాళీ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగానూ తన్మయ్ రికార్డు నెలకొల్పాడు. కేవలం 119 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. 39ఏళ్ల క్రితం దేశవాళీ క్రికెట్ లో రవిశాస్త్రి 123 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా.. ఆ రికార్డులను తన్మయ్ బద్దలు కొట్టాడు. మరోవైపు రంజీ ట్రోఫీలో సిక్సర్ల విషయంలోనూ రికార్డు నెలకొల్పాడు తన్మయ్. రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్ లో ఇషాన్ కిషన్ 14 సిక్సులు కొట్టాడు. తన్మయ్ తాజాగా ఇన్నింగ్స్ లో ఏకంగా 21 సిక్సులు బాదాడు.

Also Read : Kane Williamson : కేన్ మామ వ‌చ్చేశాడు.. ర‌చిన్ ర‌వీంద్ర‌కు చోటు..

తన్మయ్ పేరిట సరికొత్త రికార్డు..
తన్మయ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీని నమోదు చేశాడు. 2017-18లో దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో మరియస్ 191 బంతుల్లో 300 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ఆ రికార్డును తన్మయ్ బద్దలు కొట్టాడు. కేన్ రూథర్ ఫర్డ్ 234 బంతుల్లో, వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ 244 బంతుల్లో, శ్రీలంకకు చెందిన కుశాల్ పెరిరా 244 బంతుల్లో ట్రిబుల్ సెంచరీలు చేశారు. తన్మయ్ ఏకంగా 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

లారా రికార్డును బద్దలు కొడతాడా?
తన్మయ్ ఇంకా క్రీజులోనే ఉన్నాడు. అయితే, బ్రియన్ లారా 501 పరుగుల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేందుకు ప్రయత్నం చేస్తారా అన్న ప్రశ్నకు పీటీఐతో తన్మయ్ అగర్వాల్ లేదని సమాదానం ఇచ్చాడు. శనివారం ఎంతసేపు బ్యాటింగ్ చేస్తామో నాకు తెలియదు కాబట్టి నేను అలా ఆలోచించడం లేదు. తొలిరోజు ఆడిన విధంగానే రెండోరోజూ బ్యాటింగ్ చేస్తా. ఆడుతున్న క్రమంలో లారా రికార్డును చేరుకుంటే మంచిదే. అంతేకానీ, నా మనసులో ఇది సాధించాలని లేదని తన్మయ్ అన్నాడు. మరోవైపు భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మహారాష్ట్ర – కతియావార్ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ లో 443 పరుగులు చేసిన బీబీ నింబాల్కర్ పేరుమీద ఉంది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు