TATA IPL 2026 Player Trade updates total 8 players from Sanju Samson to Arjun Tendulkar
IPL 2026 Trade : ఐపీఎల్ ట్రేడింగ్ విండో ముగిసింది. ఈ పద్దతి ద్వారా (IPL 2026 Trade) మొత్తం 8 మంది ఆటగాళ్లను జట్లు పరస్పరం మార్పిడి చేసుకున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. సంజూ శాంసన్ రాజస్థాన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లాడు. మరోవైపు జడేజా సీఎస్‌కే నుంచి రాజస్థాన్‌కు వచ్చాడు.
అతడితో పాటు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ కూడా రాజస్థాన్ కు మారాడు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. 18 కోట్ల మొత్తానికే సీఎస్‌కేలోకి సంజూ శాంసన్ వెళ్లగా.. నాలుగు కోట్ల తక్కువ మొత్తానికి అంటే రూ.14 కోట్ల మొతానికే జడేజా ఆర్ఆర్‌లోకి వెళ్లాడు.
గత కొన్ని ఎడిషన్లుగా ముంబై ఇండియన్స్‌తో ఉన్న అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ షమీ కూడా రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో జట్టులో చేరాడు.
రవీంద్ర జడేజా..
సీనియర్ ఆల్ రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా రాబోయే ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరపున ప్రాతినిధ్యం వహిస్తాడు. CSK తరపున 12 సీజన్లు ఆడిన జడేజా 250 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లలో ఒకడు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా.. అతని లీగ్ ఫీజును రూ.. 18 కోట్ల నుండి రూ. 14 కోట్లకు సవరించారు.
సంజూ సామ్సన్..
రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్, భారత వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ సామ్సన్ తన ప్రస్తుత లీగ్ ఫీజు రూ.18 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ప్రాతినిధ్యం వహిస్తాడు. లీగ్‌లో అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లలో ఒకరైన సామ్సన్ 177 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. సంజూ ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడాడు. సీఎస్‌కే అతడికి మూడో ఫ్రాంఛైజీ అవుతుంది.
సామ్ కరన్..
ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) నుండి రాజస్థాన్ రాయల్స్ (RR) కు మారాడు. అతని ప్రస్తుత లీగ్ ఫీజు రూ. 2.4 కోట్ల మొత్తాన్నే అందుకోనున్నాడు. 27 ఏళ్ల ఈ ఆటగాడు ఇప్పటి వరకు 64 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటి వరకు అతడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడాడు. రాజస్థాన్ అతడికి మూడో ఫ్రాంఛైజీ కానుంది.
మహ్మద్ షమీ..
టీమ్ఇండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు మారాడు. ప్రస్తుత ఫీజు రూ.10 కోట్ల మొత్తాన్నే అతడు ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ జీతంగా అందుకోనున్నాడు. 2013లో ఐపీఎల్ లో అరంగ్రేటం చేసిన షమీ ఇప్పటి వరకు 119 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.
KKR : కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త బౌలింగ్ కోచ్‌గా టిమ్ సౌథీ..
🚨 NEWS 🚨#TATAIPL 2026 – Player Trade updates
🧵 A look at all the trades ahead of today’s retention deadline 🙌
Details of all trades ▶️ https://t.co/wLTQBlcame pic.twitter.com/OfmEpSM4Bi
— IndianPremierLeague (@IPL) November 15, 2025
మయాంక్ మార్కండే..
లెగ్ స్పిన్నర్ అయిన మయాంక్ మార్కండే కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి తన పాత ఫ్రాంఛైజీ అయిన ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. తన ప్రస్తుత ఫీజు రూ.30లక్షలతోనే అతడు ముంబైలో చేరాడు. మార్కండే తన ఐపీఎల్ కెరీర్‌ను ముంబైతోనే ప్రారంభించాడు. ఆ తరువాత అతడు రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్ తరుపున తరుపున ఆడాడు.
అర్జున్ టెండూల్కర్..
గత కొన్నాళ్లుగా ముంబై ఇండియన్స్‌లో భాగమైన అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు మారాడు. అతడి ప్రస్తుత ఫీజు రూ.30లక్షలతోనే అతడు లక్నోలో చేరాడు.
నితీష్ రాణా..
రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ ద్వారా నితీష్ రాణా ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారాడు. అతడు ప్రస్తుత ఫీజు రూ.4.2 కోట్లతోనే ఢిల్లీకి వెళ్లాడు. ఐపీఎల్‌లో అతడు 100కు పైగా మ్యాచ్‌లు ఆడాడు.
డోనోవన్ ఫెరీరా..
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) నుండి విజయవంతమైన ట్రేడ్ తర్వాత ఆల్ రౌండర్ డోనోవన్ ఫెరీరా తన మొదటి ఫ్రాంచైజీ అయిన రాజస్థాన్ రాయల్స్ (RR) కి తిరిగి వచ్చాడు. బదిలీ ఒప్పందం ప్రకారం అతని ఫీజును రూ. 75 లక్షల నుండి రూ.1 కోటికి పెంచారు.