Jasprit Bumrah : వ‌సీమ్ అక్ర‌మ్, క‌పిల్ దేవ్, వ‌కార్ యూనిస్, జ‌హీర్ ఖాన్ రికార్డులు బ్రేక్‌.. చ‌రిత్ర సృష్టించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా..

టెస్టులో సెనా దేశాలపై అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన ఆసియా ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా (Jasprit Bumrah) చ‌రిత్ర సృష్టించాడు.

Jasprit Bumrah : వ‌సీమ్ అక్ర‌మ్, క‌పిల్ దేవ్, వ‌కార్ యూనిస్, జ‌హీర్ ఖాన్ రికార్డులు బ్రేక్‌.. చ‌రిత్ర సృష్టించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా..

Jasprit Bumrah Becomes Asian Pacer With Most 5 Wicket Hauls Against SENA Nations

Updated On : November 14, 2025 / 5:48 PM IST

Jasprit Bumrah : టీమ్ఇండియా పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌నత సాధించాడు. టెస్టులో సెనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన ఆసియా ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా చ‌రిత్ర సృష్టించాడు. కోల్‌క‌తా వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయ‌డం ద్వారా బుమ్రా (Jasprit Bumrah) ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

ఈ క్ర‌మంలో అత‌డు పాకిస్తాన్ దిగ్గ‌జ ఆట‌గాడు వ‌సీం అక్ర‌మ్ ను అధిగ‌మించాడు. అక్ర‌మ్ సెనా దేశాల‌పై 44 మ్యాచ్‌లు ఆడ‌గా 12 సార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఇక బుమ్రా 43 మ్యాచ్‌ల్లో 13 సార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. వీరిద్ద‌రి త‌రువాత ఈ జాబితాలో క‌పిల్ దేవ్‌, వ‌కార్ యూనిస్ త‌దిత‌రులు ఉన్నారు.

KKR : కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొత్త బౌలింగ్‌ కోచ్‌గా టిమ్‌ సౌథీ..

టెస్టుల్లో సెనా దేశాల పై అత్య‌ధిక సార్లు ఐదు వికెట్ల ఘ‌న‌త సాధించిన ఆసియా ఫాస్ట్ బౌల‌ర్లు వీరే..

* జ‌స్‌ప్రీత్ బుమ్రా (భార‌త్‌) – 13 సార్లు (43 మ్యాచ్‌ల్లో)
* వ‌సీమ్ అక్ర‌మ్ (పాకిస్తాన్‌) – 12 సార్లు (44 మ్యాచ్‌ల్లో)
* క‌పిల్ దేవ్ (భార‌త్‌) – 11 సార్లు (61 మ్యాచ్‌ల్లో)
* వ‌కార్ యూనిస్ (పాకిస్తాన్‌) – 9 సార్లు (43 మ్యాచ్‌ల్లో)
* ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్‌) – 8 సార్లు (37 మ్యాచ్‌ల్లో)
* జ‌హీర్ ఖాన్ (భార‌త్‌) – 8 సార్లు (57 మ్యాచ్‌ల్లో)
* షోయ‌బ్ అక్త‌ర్ (పాకిస్తాన్‌) – 8 సార్లు (21 మ్యాచ్‌ల్లో)