KKR : కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొత్త బౌలింగ్‌ కోచ్‌గా టిమ్‌ సౌథీ..

ఐపీఎల్ 2026 ముందు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ (KKR ) త‌మ కోచింగ్ బృందాన్ని పూర్తిగా మార్చేస్తుంది

KKR : కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొత్త బౌలింగ్‌ కోచ్‌గా టిమ్‌ సౌథీ..

KKR sign Tim Southee as new bowling coach ahead of IPL 2026

Updated On : November 14, 2025 / 4:03 PM IST

KKR : ఐపీఎల్ 2026 ముందు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌మ కోచింగ్ బృందాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇటీవ‌లే చంద్ర‌కాంత్ పండిట్ స్థానంలో హెడ్‌కోచ్‌గా అభిషేక్ నాయ‌ర్‌ను నియ‌మించ‌గా నిన్న స‌హాయ‌క కోచ్‌గా షేన్ వాట్స‌న్‌ను నియ‌మించింది. ఇక తాజాగా న్యూజిలాండ్ మాజీ పేస‌ర్ టిమ్ సౌథీని త‌మ బౌలింగ్ కోచ్‌గా నియ‌మించింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆ ఫ్రాంచైజీ తెలియ‌జేసింది. అంత‌క ముందు భ‌ర‌త్ అరుణ్ కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా ప‌ని చేశారు.

‘కేకేఆర్ (KKR)కుటుంబంలోకి మ‌ళ్లీ సౌథీకి స్వాగతం పలుకుతున్నాం. అతడి అనుభవం, సాంకేతిక నైపుణ్యం మా జట్టు బౌలింగ్‌ విభాగానికి ఎంతో ఉపయోగపడుతుంది. అతడి నాయకత్వ లక్షణాలు మా యువ బౌలర్లకు మార్గనిర్దేశనం చేస్తాయి.’ అని కేకేఆర్‌ సీఈఓ వెంకీ మైసూర్ తెలిపారు.

IND vs SA : గంభీర్.. ఎంత నువ్వు లెఫ్ట్ హ్యాండ్ అయితే మాత్రం ఇలా చేస్తావా..

‘కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా నియ‌మితులు కావ‌డం ప‌ట్ల సౌథీ ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. తిరిగి కేకేఆర్‌తో కలిసి పనిచేయడం నాకు గౌరవంగా ఉంది. ఈ ప్రాంఛైజీకి ఘనమైన చరిత్ర ఉంది. పెద్దసంఖ్యలో అభిమానులు, అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. బౌలర్లతో కలిసి ప‌నిచేయ‌డానికి, మా జట్టు ఐపీఎల్‌ 2026లో విజయం సాధించేందుకు కృషి చేస్తా.’ అని సౌథీ అన్నాడు.

IND vs SA : బుమ్రా పాంచ్ ప‌టాకా.. తొలి ఇన్నింగ్స్‌లో ద‌క్షిణాఫ్రికా ఆలౌట్‌.. స్కోరెంతంటే?

న్యూజిలాండ్ త‌రుపున సౌథీ 107 టెస్టులు, 161 వ‌న్డేలు, 126 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 700కు పైగా వికెట్లు తీశాడు.