గురువుకు నివాళులర్పించిన సచిన్

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 11:21 AM IST
గురువుకు నివాళులర్పించిన సచిన్

Updated On : September 5, 2019 / 11:21 AM IST

టీచర్స్ డే సందర్భంగా సచిన్ టెండూల్కర్ ఇవాళ (సెప్టెంబర్ 5, 2019)న తన గురువు రమాకాంత్ ఆచ్రేకర్కి నివాళి అర్పించారు. ఆయన ఫొటోకి దండ వేసి ఘన నివాళులర్పించారు.  ట్విట్టర్‌లో తన గురువుతో కలిసున్న చిన్ననాటి ఫోటో ఒకటి సచిన్ షేర్ చేశాడు.

ఈ సందర్భంగా సచిన్ తన గురువు గురించి మాట్లాడుతూ.. గురువులు చదువు మాత్రమే కాకుండా, మన జీవితంలో ఎలా మెలగాలో తెలిపే విలువలు కూడా నేర్పిస్తారు. ఆచ్రేకర్ సర్ నాకు క్రికెట్‌తో పాటు జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్పించారు. ఆయనతో నా అనుబంధాన్ని మాటల్లో చెప్పలేను. దాదాపు 30 ఏళ్ల కిందట, 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను అచ్రేకర్ సర్ దగ్గరకు వెళ్లాను. 

రమాకాంత్ అచ్రేకర్ 87 ఏళ్ల వయస్సులో జనవరి 2, 2018న ముంబైలో మరణించిన విషయం తెలిసిందే. అచ్రేకర్ సచిన్ కు మాత్రమే కాదు ఎందరో యువ క్రికెటర్లకు కోచింగ్ ఇచ్చారు.