Team India Asia Cup 2025 Squad Announcement Delayed
Asia Cup 2025 : యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 (Asia Cup 2025 ) టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే భారత జట్టును నేడు (మంగళవారం, ఆగస్టు 19)న ఎంపిక చేయనున్నారు. ఎంపిక చేసిన జట్టుకు సంబంధించిన వివరాలను వాస్తవానికి మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు విలేకరుల సమావేశంలో వెల్లడించాల్సి ఉంది. అయితే.. ఈ ప్రకటన కాస్త ఆలస్యం కానుంది.
మీడియా సమావేశంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాల్గొననున్నారు. కానీ.. ముంబైలో భారీ వర్షాలు కురుస్తుండడంతో మీడియా సమావేశం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని బీసీసీఐ తెలిపినట్లు హిందూస్తాన్ టైమ్స్ తమ కథనంలో పేర్కొంది.
రెడ్ అలర్ట్..
ముంబైలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో స్థానిక అధికారులు అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముంబై వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
Asia Cup 2025 hockey tournament : ఆసియాకప్ 2025 హాకీ టోర్నమెంట్.. పాకిస్థాన్ స్థానంలో బంగ్లాదేశ్!
ఇదిలా ఉంటే.. జట్టు ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
గిల్‌కు చోటు ఉందా?
ఆసియా కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ జట్టులో టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కుతుందా లేదా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓపెనింగ్ స్థానం కోసం సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్, అభిషేక్ శర్మల నుంచి గిల్‌కు గట్టి పోటీ ఉంది.
CAPTAIN HAS ARRIVED AT BCCI HQ FOR ASIA CUP TEAM SELECTION…!!! [RevSportz] pic.twitter.com/VBCWYXPJeu
— Johns. (@CricCrazyJohns) August 19, 2025
ఆసియాకప్-2025కు భారత జట్టు (అంచనా)..
సూర్యకుమార్ (కెప్టెన్), సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, జితేశ్ శర్మ.