Team India batting coach Sitanshu Kotak supports Sanju Samson despite his recent poor form
Sanju Samson : భారత్, న్యూజిలాండ్ జట్లు తిరువనంతపురం వేదికగా నేడు (జనవరి 31న) ఐదో టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. కాగా.. ఈ మ్యాచ్‌కు ముంటు టీమ్ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్ గురించి భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో సంజూ శాంసన్ ఘోరంగా విఫలం అవుతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 40 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడి స్థానంపై ప్రశ్నలు మొదలు అయ్యాయి. టీ20 ప్రపంచకప్‌లో అతడిని జట్టు నుంచి తొలగించి ఫామ్‌లో ఇషాన్ కిషన్ ను ఆడించాలనే డిమాండ్లు మొదలు అయ్యాయి.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్.. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కు ఆన్‌ఫీల్డ్ అంపైర్లు వీరే..
వీటిపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు. సంజూ శాంసన్‌కు మద్దతుగా నిలిచాడు. అతడి ఫామ్ పై ఎలాంటి ఆందోళన లేదన్నాడు. అతడి సామర్థ్యం ఏంటో అందరికి తెలుసునని చెప్పుకొచ్చాడు. ఒక్కసారి పరుగులు చేయడం ప్రారంభిస్తే అతడిని ఆపడం ఎవరి తరం కాదన్నాడు.
‘సంజూ అంటే సంజూనే. అతడు ఎక్కువ పరుగులు చేయలేకపోతున్నాడు. కానీ ఇది ఆటలో భాగం. కొన్ని సార్లు వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో భారీ స్కోరు చేస్తే.. మరికొన్ని సార్లు విఫలం అవుతారు. కాబట్టి ఇదంతా వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. అతడు ఎంత దృఢంగా తిరిగి వస్తాడు అనే ధానిపై ఆధారపడి ఉంటుంది.’ అని కోటక్ తెలిపాడు.
ఇక బ్యాటింగ్ కోచ్‌గా తన పని అతడు కృంగిపోకుండా చేయడం. అతడి మానసిక స్థితి సరైన దిశలో ఉంచేలా చేయడం అని అన్నాడు. అంతేకాకుండా అతడితో ఎక్కువగా ప్రాక్టీస్ చేయించడం కూడా అని చెప్పుకొచ్చాడు. అతడు ఏం చేయగలడో అందరికి తెలుసు. ఇంతకంటే అతడి గురించి ఇంకేం చెప్పలేమని కోటక్ అన్నారు.
సంజూ శాంసన్ తన చివరి ఐదు టీ20 మ్యాచ్‌ల్లో ఘోరంగా విఫలం అయ్యాడు. ఈ ఐదు మ్యాచ్‌ల్లో అతడి అత్యధిక స్కోరు 37 పరుగులు మాత్రమే. ఇక ఓపెనర్‌గా తన చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో 12.8 సగటుతో 128 పరుగులు మాత్రమే చేశాడు. ఇషాన్ కిషన్ నుంచి తీవ్రమైన పోటీ ఉండడంతో న్యూజిలాండ్‌తో తిరువనంతపురం వేదికగా జరగనున్న ఐదో టీ20 మ్యాచ్‌లో అతడు భారీ స్కోరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.