Jasprit Bumrah Practice: నెట్స్‌లో చెమటోడ్చుతున్న టీమిండియా బౌలర్ బుమ్రా.. వీడియో చూడండి..

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. బుమ్రా ఇటీవల జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్ లో ఆడలేదు. గాయం కారణంగా ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు.

Jasprit Bumrah

Jasprit Bumrah Practice: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బ్రుమా నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. బుమ్రా ఇటీవల జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్ లో ఆడలేదు. గాయం కారణంగా ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో ఆ తరువాత దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్ లు ఆడనుంది. ఇప్పటికే ఈ రెండు సిరీస్ లకు జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమైన బుమ్రాను ఈ సిరీస్‌లకు సెలక్టర్లు ఎంపిక చేశారు.

ICC T20 Rankings: ఒక్క సెంచరీతో దూసుకొచ్చిన కోహ్లీ.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి టాప్-10లో సూర్యకుమార్ ఒక్కడే ..

మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లకు చురుకైన బంతులు సంధించేలా బుమ్రా నెట్స్ లో కఠోర సాధన చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బుమ్రా పోస్టు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచ కప్ కోసం భారత్ 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సభ్యుల్లో కీలక ఆటగాడిగా బుమ్రా కూడా ఉన్నాడు. అంతకుముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లకు కూడా బుమ్రా ఎంపిక కావటంతో స్టేడియంలో ప్రత్యర్థులకు పదునైన బంతులు విసిరేలా నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నాడు.