ICC T20 Rankings: ఒక్క సెంచరీతో దూసుకొచ్చిన కోహ్లీ.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి టాప్-10లో సూర్యకుమార్ ఒక్కడే ..

ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తాజా ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్స్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 14 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

ICC T20 Rankings: ఒక్క సెంచరీతో దూసుకొచ్చిన కోహ్లీ.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి టాప్-10లో సూర్యకుమార్ ఒక్కడే ..

Virat Kohli

ICC T20 Rankings: ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తాజా ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్స్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 14 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. UAEలో జరిగిన ఆసియాకప్ టోర్నమెంట్‌లో కోహ్లీ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన (ఐదు మ్యాచ్‌లలో 276 పరుగులు) తర్వాత తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. ఆసియాకప్ టోర్నీలో కోహ్లీ టీ20లో తన మొదటి అంతర్జాతీయ సెంచరీని కూడా సాధించాడు. టీమిండియా సారధి రోహిత్ శర్మ 606 పాయింట్లతో 14వ ర్యాంకులో ఉండగా.. కోహ్లీ 599 పాయింట్లతో తర్వాతి స్థానంలో నిలిచాడు.

Mumbai Indians: ముంబై ఇండియన్స్ యాజమాన్యం కీలక నిర్ణయం.. జయవర్ధనే, జహీర్‌ఖాన్‌లకు నూతన బాధ్యతలు

ఇదిలాఉంటే భారత్ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ టాప్-10 జాబితాలో నిలిచాడు. 755 పాయింట్స్‌తో సూర్యకుమార్ 4వ స్థానంలో నిలిచాడు. టీమిండియా నుంచి టాప్ -10 జాబితాలో నిలిచిన ఏకైక క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే. ఇక ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌ ఆటగాడు మహ్మద్‌ రిజ్వాన్‌ (810 పాయింట్లతో) మొదటి స్థానంలో నిలవడగా, 792 పాయింట్లతో ఐడెన్ మార్కరన్ రెండవ స్థానంలో నిలిచాడు.

ICC Ranking

ICC Ranking

బౌలర్ల జాబితాలో భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ఏడో ర్యాంక్‌ను కోల్పోగా, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ (తొమ్మిది స్థానాలు ఎగబాకి 41వ ర్యాంక్‌కి), అక్షర్ పటేల్ (14 స్థానాలు ఎగబాకి 57వ ర్యాంక్‌కు) చేరుకున్నారు. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ 792 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన తబ్రైజ్ షమ్సీ (716 పాయింట్లు), ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్ రషీద్ (702 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా.. ఆల్‌రౌండర్లలో అగ్రస్థానాన్ని బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్‌ దక్కించుకున్నాడు.