Virat Kohli Birthday : స్కాట్లాండ్‌పై విజయం.. కోహ్లికి బర్త్‌డే గిఫ్ట్‌గా టీమిండియా ఏం చేసిందో చూడండి..!

టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలో టీమిండియా అద్భుత విజయంతో ఆకట్టుకుంది. సెమీస్ రేసులో స్కాట్లాండ్ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Virat Kohli 33th Birthday : టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలో టీమిండియా అద్భుత విజయంతో ఆకట్టుకుంది. సెమీస్ రేసులో స్కాట్లాండ్ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ఈ విజయంతో టీమిండియా రన్ రేటు కూడా బాగా మెరుగుపడింది.

మొదటి బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి జట్టు స్కాట్లాండ్ ఆటగాళ్లను 85 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయాన్ని మరింత సెలబ్రేట్ చేసుకోవాలని టీమిండియా భావించింది. అందులోనూ తమ కెప్టెన్ విరాట్ కోహ్లీ 33వ పుట్టినరోజు కూడా ఉంది. ఇంకేముంది సెలబ్రేట్ గట్టిగా చేయాలనుకుంది. అందులో భాగంగానే విరాట్‌ కోహ్లికి.. పుట్టినరోజున గొప్ప కానుక అందించింది.

కోహ్లి నవంబరు 5న 33వ వసంతంలో అడుగుపెట్టారు. మ్యాచ్‌ అనంతరం.. టీమిండియా డ్రెస్సింగ్‌ రూంలో సంబరాలు జరుపుకుంది. మెంటార్‌ ఎంఎస్‌ ధోని కూడా కోహ్లీ పార్టీ వేడుకల్లో పాల్గొన్నాడు. జట్టు సిబ్బందితో పాటు కోహ్లి పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. కోహ్లీ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియోను టీమిండియా తమ ఇన్‌స్టా పేజీలో షేర్‌ చేసింది. ఇప్పుడా వీడియో తెగ వైరల్‌ అవుతోంది. టీమిండియా అద్భుత విజయం తర్వాత విరాట్‌ కోహ్లి బర్త్‌డే వేడుకలు ఇలా జరుపుకున్నామనే క్యాప్షన్‌తో షేర్ చేసింది.


ఈ వీడియోను చూసిన కోహ్లీ అభిమానులు కూడా విరాట్ హ్యాపీ బర్త్ డే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు స్కాట్లాండ్ పై విజయం సాధించిన రోజే తన పుట్టినరోజు కావడంతో కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ అద్భుతమైన సమయంలో తనతో పాటు సతీమణి అనుష్క శర్మ, గారాల పట్టి వామిక కూడా తనతోనే ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నానని కోహ్లీ చెప్పుకొచ్చాడు.


Read Also :  Athiya Shetty Birthday : లవ్ పార్ట్‌నర్ ఎవరో చెప్పిన రాహుల్

ట్రెండింగ్ వార్తలు