Harbhajan Singh on BCCI Stance : దేశం కంటే ఏదీ గొప్ప కాదు.. భార‌త్‌, పాక్ మ్యాచ్ పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ కామెంట్స్..

ఆసియాక‌ప్‌లోనూ భార‌త జ‌ట్టు పాక్‌తో ఆడ‌కూడ‌ని మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ (Harbhajan Singh BCCI Asia Cup Stance ) అన్నాడు.

Team India ex cricketer Harbhajan Singh Blasts BCCI Asia Cup Stance

Harbhajan Singh on BCCI Stance : యూఏఈ వేదిక‌గా సెప్టెంబ‌ర్ 9 నుంచి ఆసియా క‌ప్ 2025 జ‌ర‌గ‌నుంది. ఈ మెగాటోర్నీలో చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య సెప్టెంబ‌ర్ 14న మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ పైనే అంద‌రి దృష్టి ప‌డింది. ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌రువాత భార‌త్‌, పాక్ దేశాల మ‌ధ్య ప‌రిష్థితులు చాలా సంక్లిష్టంగా మారాయి. ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవ‌ద్ద‌ని, క్రికెట్ మ్యాచ్‌లు ఆడ‌కూడ‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ప్ర‌పంచ ఛాంపియ‌న్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ నుంచి భార‌త ఛాంపియ‌న్స్ జ‌ట్టు పాక్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాక‌రించి వైదొలిగింది. దీంతో ఆసియాక‌ప్‌లోనూ భార‌త జ‌ట్టు పాక్‌తో ఆడ‌కూడ‌ని, దేశం కంటే క్రికెట్ మ్యాచ్ అంత ముఖ్యం కాద‌ని మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ (Harbhajan Singh on BCCI Stance) అన్నాడు.

వారి త్యాగాల‌తో పోలిస్తే క్రికెట్ అంత ముఖ్యం కాదు..

* ఏదీ ముఖ్య‌మో, ఏది కాదో అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రం బీసీసీఐకి ఉంద‌న్నాడు. త‌న వ‌ర‌కు అయితే.. కుటుంబాల‌ను వ‌దిలి, జీవితాల‌ను త్యాగం చేస్తూ స‌రిహ‌ద్దుల్లో పోరాడే సైనికులే ముఖ్య‌మ‌న్నాడు. వారి త్యాగ‌ఫ‌లంతోనే మ‌నం ఇలా ఉండ‌గ‌లుగుతున్నామ‌న్నాడు. వారు చేసే త్యాగాల‌తో పోలిస్తే క్రికెట్ మ్యాచ్ ఆడ‌క‌పోవ‌డం చాలా చిన్న విష‌యం అని చెప్పుకొచ్చాడు.

Worst Leave Of The Year : వరస్ట్ లీవ్ ఆఫ్ ది ఇయర్.. రిజ్వాన్ క్లీన్ బౌల్డ్ వీడియో వైర‌ల్‌..

* ఇక మ‌న ప్ర‌భుత్వం వైఖ‌రి కూడా కూడా అలాగే ఉంది. ఓ వైపు స‌రిహద్దుల్లో సైన్యం పోరాడుతున్న స‌మ‌యంలో క్రికెట్ ఆడేందుకు వెళ్ల‌డం స‌మంజ‌సం కాదు. దేశం కంటే ఏదీ ముఖ్యం కాదు. దేశంతో పోలిస్తే క్రికెట్ చాలా చిన్న విష‌యం. ఎప్పుడైనా దేశానికే తొలి ప్రాధాన్యం అని హ‌ర్భ‌జ‌న్ తెలిపాడు.

ప్ర‌తి ఒక్క‌రి పై ఆ బాధ్య‌త‌..

మ‌న‌కు ఓ గుర్తింపు వ‌చ్చిందంటే అందుకు కార‌ణం ఈ దేశం.. న‌టులైనా, క్రీడాకారులైనా, ఇంకెవ‌రైనా కూడా కూడా దేశం కంటే గొప్ప కాదు అని భ‌జ్జీ చెప్పాడు. ముందుగా దేశం.. మనం దానికి చేయాల్సిన విధులను నెరవేర్చాలి. దేశానికి ఇచ్చే ప్రాధాన్య‌త‌తో పోలిస్తే.. ఒక్క క్రికెట్ మ్యాచ్ ఆడ‌క‌పోతే ఏమీ కాదు. అని భ‌జ్జీ తెలిపాడు.

Dewald Brevis century : ఆ కొట్టుడు ఏంది సామీ.. ఆసీస్‌కే సుస్సు పోయించాడుగా.. జూనియ‌ర్ ఏబీడీ రికార్డు సెంచ‌రీ..

ఆసియా క‌ప్‌లో లీగ్ ద‌శ‌లో భార‌త షెడ్యూల్ ఇదే..
* సెప్టెంబ‌ర్ 10న – యూఏఈ
* సెప్టెంబ‌ర్ 14న – పాకిస్తాన్‌
* సెప్టెంబ‌ర్ 19న – ఒమ‌న్‌