Team India ex cricketer Sunil Gavaskar Demands Action After Pakistan Media Act
Sunil Gavaskar : ఆసియాకప్ 2025లో పాకిస్తాన్ ఆటతీరు ఎలాగున్నప్పటికి కూడా ఆ జట్టు వ్యవహరిస్తున్న తీరుపై టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌లకు ఆలస్యంగా రావడం, తప్పనిసరిగా హాజరు కావాల్సిన విలేకరుల సమావేశాలకు రాకపోవడం వంటి వాటిపై గవాస్కర్ మండిపడ్డాడు.
సెప్టెంబర్ 14న భారత్, పాక్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ టాస్ సమయంలో, మ్యాచ్ ముగిసిన తరువాత టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు మిగిలిన భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయని సంగతి తెలిసిందే. దీనిపై పీసీబీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ పై చర్యలు తీసుకోవాలని, తమ జట్టు ఆడే మ్యాచ్‌లకు అతడిని రిఫరీ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది.
అటు పీసీబీ ఎన్ని ఫిర్యాదు చేస్తున్నప్పటికి కూడా అవి నాయ్యమైనవి కాకపోవడంతో ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) మాత్రం పట్టించుకోవడం లేదు. అయినప్పటికి కూడా పీసీబీ అదే పనిగా ఐసీసీకి మెయిల్స్ చేస్తూనే ఉంది. ఈ విషయంపైనే గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పీసీబీ చర్యల వెనుక ఉన్న లాజిక్ ఏంటో అర్థం కావడం లేదన్నాడు. తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన బాధ్యతలు పక్కన బెట్టిన పాక్ పై ఖచ్చితంగా ఐసీసీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
‘షేక్ హ్యాండ్ చేయాలని క్రికెట్ రూల్ బుక్‌లో ఎక్కడా లేదు. అయినప్పటికి దీనిపై పీసీబీ పదే పదే ఫిర్యాదు చేస్తోంది. క్రికెట్‌లోనే కాదు ఇతర ఆటల్లోనూ ఇలాంటివి ఘటనలు జరిగాయి. పీసీబీ ఏ లాజిక్ ప్రకారం ఫిర్యాదులు చేస్తుందో అర్థం కావడం లేదు. అయినప్పటికి కూడా ఐసీసీ పట్టించుకోకుండా మంచి పని చేసింది. ‘అని గవాస్కర్ అన్నాడు.
అదే సమయంలో మ్యాచ్ సమయంలో ఆయా జట్ల నుంచి మీడియా సమావేశాలను ఖచ్చితంగా ఎవరో ఒకరు హాజరుకావాలన్నారు. కానీ పాక్ తీరు మాత్రం ఈ విషయంలో సరిగా లేదన్నారు. కెప్టెన్ లేదా కోచ్ లేదా ఆటగాళ్లలో ఏ ఒక్కరు కూడా మీడియా సమావేశాలకు హాజరు కావడం లేదన్నారు.
Sri Lanka : పాక్ చేతిలో ఓటమి.. శ్రీలంక ఫైనల్ చేరాలంటే..?
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. పాక్ జట్టు ఖచ్చితంగా చేయాల్సిన వాటిని పాటించడం లేదు. బాయ్‌కాట్ నినాదంతో యూఏఈతో మ్యాచ్‌కు ఆలస్యంగా వచ్చింది. ఇలా చేసినందుకు ఐసీసీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని గవాస్కర్ కోరారు.