Sri Lanka : పాక్ చేతిలో ఓటమి.. శ్రీలంక ఫైనల్ చేరాలంటే..?
పాక్ చేతిలో ఓడిపోవడంతో ఆసియాకప్ 2025లో శ్రీలంక (Sri Lanka) అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. అయినప్పటికి కూడా..

Do you know sri lanka will still in Asia Cup 2025 final race
Sri Lanka : ఆసియాకప్ 2025లో శ్రీలంకకు ఏదీ కలిసి రావడం లేదు. గ్రూప్ స్టేజీలో వరుస విజయాలతో సూపర్-4లో అడుగుపెట్టిన లంకకు వరుస షాక్‌లు తగిలాయి. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. మంగళవారం అబుదాబి వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉండగా 5 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దీంతో లంక (Sri Lanka) ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.
లంక ఫైనల్ చేరుకోవాలంటే..?
పాక్ పై ఓటమితో శ్రీలంక జట్టు ఇప్పటికే ఆసియాకప్ 2025 నుంచి దాదాపుగా నిష్ర్కమించినట్లే. ఆ జట్టు ఫైనల్‌కు చేరుకోవాలంటే మహాద్భుతం జరగాల్సిందే. ప్రస్తుతం సూపర్-4లో భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, పాక్ రెండు, బంగ్లాదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. అటు లంక నెట్‌రన్‌రేటు (-0.590) నెగిటివ్‌కు చేరుకుంది.
IND vs BAN : భారత్‌తో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడికి గాయం..!
లంక జట్టు ఫైనల్‌కు చేరుకోవాలంటే బంగ్లాదేశ్ తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో భారత్, పాకిస్తాన్‌లను ఓడించాల్సి ఉంటుంది. అదే సమయంలో లంక జట్టు భారత్ పై భారీ విజయాన్ని సాధించాలి. అప్పుడు మూడు విజయాలు సాధించిన బంగ్లాదేశ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో ఫైనల్‌కు చేరుకుంటుంది. భారత్, లంక, పాక్ జట్ల ఖాతాల్లో తలా రెండు పాయింట్లు ఉంటాయి. మెరుగైన రన్‌రేటు ఉన్న జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. భారత్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తేనే లంక రన్‌రేటు మెరుగు అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా జరగడం దాదాపుగా అసాధ్యం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కమిందు మెండిస్ (50; 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించాడు. పాక్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. హరిస్ రవూఫ్, హుస్సేన్ తలాత్ చెరో రెండు వికెట్లు సాధించారు. అబ్రాద్ అహ్మద్ ఓ వికెట్ తీశాడు.
Team India : భారత్‌కు ఐసీసీ బిగ్ షాక్.. భారీ జరిమానా..
అనంతరం 134 పరుగుల లక్ష్యాన్ని పాక్ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (5), సైమ్ అయూబ్ (2)లు విఫలమైనా.. నవాజ్ (38 నాటౌట్; 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), తలాత్ (32 నాటౌట్; 30 బంతుల్లో 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లంక బౌలర్లలో మహేశ్ తీక్షణ, వనిందు హసరంగ చెరో రెండు వికెట్లు తీశారు.