Yuzvendra Chahal : ధనశ్రీ ఫోటోలపై చహల్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. ‘నా తాజ్ మ‌హ‌ల్..’

టీమ్ఇండియా స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చహల్ (Yuzvendra Chahal) యూట్యూబర్‌, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మ (Dhanashree Verma) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

Yuzvendra Chahal-Dhanashree Verma

Yuzvendra Chahal-Dhanashree Verma : టీమ్ఇండియా స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చహల్ (Yuzvendra Chahal) యూట్యూబర్‌, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మ (Dhanashree Verma) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట ఎల్ల‌ప్పుడూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇద్ద‌రికి సంబంధించిన ఫోటోలు, వీడియోల‌ను అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ధ‌న శ్రీ వ‌ర్మ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న‌కు సంబంధించిన కొన్ని ఫోటోల‌ను పోస్ట్ చేయ‌గా వాటికి చ‌హ‌ల్ ఇచ్చిన రిప్లై వైర‌ల్ గా మారింది.

pic @Dhanashree Verma Instagram

ధ‌న శ్రీ వ‌ర్మ నీలిరంగు దుస్తులు ధ‌రించి త‌న స్టైల్‌ను గ్రేస్‌ను ప్ర‌ద‌ర్శిస్తూ దిగిన ఫోటోల‌ను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు క్ష‌ణాల్లో వైర‌ల్‌గా మారాయి. నెటీజ‌న్లు ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తుండ‌గా ఆమె భర్త‌, స్పిన్న‌ర్ చ‌హ‌ల్ సైతం ఆ ఫోటోల‌పై స్పందించాడు. త‌న భార్య‌పై ఉన్న ప్రేమ‌ను దాచుకోలేక “నా తాజ్‌మ‌హ‌ల్” అంటూ కామెంట్ చేశాడు. రెండు ఫైర్ ఎమోజీల‌తో పాటు రెండు ల‌వ్ ఎమోజీల‌ను సైతం జ‌త చేశాడు. అత‌డు చేసిన ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Yuzvendra Chahal Comment On Dhanashree Photo

కౌంటీలు ఆడుతున్న చ‌హ‌ల్‌

ఆసియాక‌ప్‌, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు ప్ర‌క‌టించిన టీమ్ఇండియా జ‌ట్టులో చహ‌ల్ సెల‌క్ట్ కాలేదు. దీంతో ఇంగ్లాండ్ కౌంటీ జ‌ట్టు అయిన కెంట్‌తో త‌రుపున మూడు మ్యాచులు ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. “ఇది నాకు అద్భుతమైన సవాలు. ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని చాహల్ ఓ సంద‌ర్భంలో తెలిపాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో కెంట్ త‌రుపున ఆడుతూ మంచి ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాడు.

Asia Cup 2023 : ఫైన‌ల్‌కు ముందు శ్రీలంక‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌.. భార‌త్‌కు స‌గం క‌ష్టాలు త‌ప్పిన‌ట్లే..!