కివీస్‌తో తొలి టీ20: నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా

వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా మరో ఫార్మాట్‌కు సిద్ధమైంది. న్యూజిలాండ్ పర్యటనలో వన్డే ఫార్మాట్ అనంతరం టీ20 ఆడేందుకు సిద్దమైన భారత్.. నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేసింది. వెల్లింగ్టన్ వేదికగా బుధవారం తొలి టీ20 జరగనుంది. ఈ మేర ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలతో పాటు రిషబ్ పంత్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. మూడు టీ20 మ్యాచ్‌ల సందర్భంగా పంత్ ఇంగ్లాండ్ నుంచి న్యూజిలాండ్ చేరుకున్నాడు. 

ఇటీవల భారత్ ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించి రెండు అనధికార వన్డేలలో ఆడాడు. టీ20లలో ఆడేందుకే న్యూజిలాండ్ చేరుకున్న పంత్ నెట్‌లో ప్రాక్టీసు చేస్తున్న ఫొటోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. దాంతో పాటు దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, పాండ్యా, శంకర్, కుల్దీప్‌ల ఫొటోలను పోస్టు చేసింది. 

ధోనీ, రోహిత్ శర్మలు చక్కని ఫామ్‌లో ఉండటంతో కెప్టెన్ కోహ్లీ జట్టులో లేకపోయినా పెద్ద ప్రభావమేమి కనబడనట్లే కనిపిస్తోంది. 

టీ20 ఆడనున్న టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, కేదర్ జాదవ్, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, శుభ్‌మాన్ గిల్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా