Team India star cricketers virat kohli and Washington Sundar visits simhadri appanna
virat kohli : టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లు ఆదివారం విశాఖలోని సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వీరికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. అంకతముందు ఆలయ అధికారులు వీరికి ఘన స్వాగతం పలికారు.
కోహ్లీ (virat kohli ) రాకతో సింహాద్రి అప్పన్న ఆలయం వద్ద సందడి నెలకొంది. తమ అభిమాన క్రికెటర్‌ను చేసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. కొందరు ఫ్యాన్స్‌తో కోహ్లీ ఫోటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rohit-Kohli : ఈ ఏడాది ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కనిపించరు.. మళ్లీ వచ్చే ఏడాదే..
శనివారం విశాఖ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ అజేయ అర్థశతకంతో రాణించాడు. ఈ సిరీస్‌లో రెండు శతకాలు, ఓ హాఫ్ సెంచరీ సహా 302 పరుగులు చేయడంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపిక అయ్యాడు.
Rohit Sharma : కేక్ తినేందుకు నిరాకరించిన రోహిత్ శర్మ.. ఒకే ఒక మాట చెప్పాడు చూడు..
కోహ్లీకి దైవ భక్తి ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్లినా స్థానికంగా ఉన్న ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ ఉంటాడు.