Rohit-Kohli : రోహిత్ శర్మ, కోహ్లీ మళ్లీ బరిలో దిగేది ఎప్పుడు.. నెక్ట్స్ డేట్ ఇదే..
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు (Rohit-Kohli) టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
South africa ODI series complete When will Kohli and Rohit next play for India
Rohit-Kohli : టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టులు, టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్లు వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా ఈ ఇద్దరు ముందుకు సాగుతున్నారు.
ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిస్తే.. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో దుమ్ములేపిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపిక అయ్యాడు. దీంతో గత కొన్నాళ్లుగా వన్డేల్లో వీరి భవితవ్యం పై వస్తున్న ఊహాగానాలకు ఈ ఇద్దరు తమ ఆటతోనే సమాధానం చెప్పారు.
KL Rahul : టాస్ గెలవడం తప్ప నేను చేసిందేమీ లేదు.. కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్..
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసింది. ఇక ఈ ఇద్దరు మళ్లీ ఎప్పుడు టీమ్ఇండియాతో తరుపున బరిలోకి దిగతారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మళ్లీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని భారత జెర్సీలో చూసేందుకు అవకాశం లేదు. డిసెంబర్ 9 నుంచి భారత జట్టు సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ డిసెంబర్ 19న ముగియనుంది.
ఆ తరువాత భారత జట్టుకు ఎలాంటి సిరీస్ లు లేవు. వచ్చే ఏడాది న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో ఆతిథ్య భారత్‌తో కివీస్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలుత వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుండగా.. టీ20 సిరీస్ జనవరి 21 నుంచి ఆరంభం కానుంది.
Rohit Sharma : కేక్ తినేందుకు నిరాకరించిన రోహిత్ శర్మ.. ఒకే ఒక మాట చెప్పాడు చూడు..
అంటే ఈ లెక్కన వన్డేలు మాత్రమే ఆడుతున్న కోహ్లీ, రోహిత్ మళ్లీ టీమ్ఇండియా తరుపున వచ్చే ఏడాది జనవరి 11నే బరిలోకి దిగనున్నారు. అయితే.. అంతకముందే వీరిద్దరు దేశవాలీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో కనిపించే అవకాశం ఉంది. అయితే.. కోహ్లీ ఢిల్లీ తరుపున రోహిత్ ముంబై తరుపున ఆడనున్నారు.
