IND vs ENG : వ‌న్డే సిరీస్ ట్రోఫీని మ‌రిచిపోయిన కోహ్లీ, రోహిత్, రాహుల్‌.. వీడియో వైర‌ల్‌

ఇంగ్లాండ్‌తో వ‌న్డే సిరీస్ అనంత‌రం కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు సంబంధించిన ఓ వీడియో వైర‌ల్‌గా మారింది.

Team India star Players forget India's ODI series trophy video viral

ఇంగ్లాండ్‌తో వ‌న్డే సిరీస్‌ను భార‌త్ క్వీన్‌స్వీప్ చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవ‌సం చేసుకుంది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా బుధ‌వారం జ‌రిగిన మూడో వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ 142 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 356 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

భార‌త బ్యాట‌ర్ల‌లో శుభ్‌మ‌న్ గిల్ (112) శ‌త‌కంతో చెల‌రేగాడు. కోహ్లీ (52), శ్రేయ‌స్ అయ్య‌ర్ (78)లు హాఫ్ సెంచ‌రీలు చేశారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీశాడు. మార్క్ వుడ్ రెండు,సాకిబ్ మ‌హ‌మూద్‌, గుస్ అట్కిన్సన్, జో రూట్ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Champions Trophy : ఛాంపియ‌న్స్ ట్రోఫీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు.. మొద‌ట్లో ఈ టోర్నీని ఏమ‌ని పిలిచేవారో తెలుసా? ఎన్ని సార్లు పేరు మార్చారంటే?

అనంత‌రం భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో ఇంగ్లాండ్ 34.2 ఓవ‌ర్ల‌లో 214 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో టామ్ బాంట‌న్ (38), బెన్ డ‌కెట్ (34) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్‌, హ‌ర్షిత్ రాణా, అక్ష‌ర్ ప‌టేల్‌, హార్దిక్ పాండ్యా త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, కుల్దీప్ యాద‌వ్‌లు చెరో ఓ వికెట్ తీశారు.

ఇక మ్యాచ్ అనంత‌రం సిరీస్ గెల‌వ‌డంతో భార‌త జ‌ట్టుకు ఐసీసీ ఛైర్మ‌న్ జై షా ట్రోఫీని అందించాడు. ఈ టోఫ్రీతో భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇంత వ‌ర‌కు అంతా బాగానే ఉంది. అయితే.. ఫోటోల‌కు ఫోజులు ఇచ్చిన త‌రువాత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు ట్రోఫీని మ‌రిచిపోయి డ్రెస్సింగ్ రూమ్ వైపుకు వెళ్లారు.

IPL 2025 : ఒక రోజు ముందుగానే ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం.. ఆర్‌సీబీ, కేకేఆర్ జ‌ట్ల మ‌ధ్య తొలి మ్యాచ్‌!

మ‌ళ్లీ ట్రోఫీ విష‌యం గుర్తుకు వ‌చ్చి రోహిత్, కేఎల్ రాహుల్‌లు వెన‌క్కి వ‌చ్చి తీసుకుని వెళ్లారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను ఓ అభిమాని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వారు ట్రోఫీని మ‌రిచిపోయారు అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ.. సిరీస్ గెల‌వ‌డం త‌న‌కు చాలా ఆనందాన్ని ఇచ్చింద‌న్నాడు. జ‌ట్టులో ప్ర‌స్తుతం చాలా స్వేచ్ఛ ఉంద‌న్నాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల పై ఆదిఫ‌త్యం ప్ర‌ద‌ర్శించామ‌ని చెప్పాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నుంచి ఇదే ధోర‌ణిలో ఆడుతున్నామ‌ని, ఇక‌పై కూడా దీన్ని కంటిన్యూ చేస్తామ‌న్నాడు.

WPL 2025 : నేటి నుంచే డ‌బ్ల్యూపీఎల్‌.. మ్యాచ్‌ల‌ను ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

అయితే.. కొన్ని సార్లు ఫ‌లితాలు అనుకున్న విధంగా రాక‌పోవ‌చ్చున‌ని చెప్పాడు. సిరీస్ విజ‌యం సాధించినా ఇంకా మెరుగుకావాల్సి అంశాలు ఉన్నాయ‌ని, వాటిపై దృష్టిసారిస్తామ‌న్నాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీలో నిల‌క‌డైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తామ‌ని తెలిపాడు.