WPL 2025 : నేటి నుంచే డ‌బ్ల్యూపీఎల్‌.. మ్యాచ్‌ల‌ను ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ 2025 సీజ‌న్ నేటి నుంచే ప్రారంభం కానుంది.

WPL 2025 : నేటి నుంచే డ‌బ్ల్యూపీఎల్‌.. మ్యాచ్‌ల‌ను ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

womens premier league 2025 starts from today

Updated On : February 14, 2025 / 9:28 AM IST

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్‌(డబ్ల్యూపీఎల్) 2025 సీజ‌న్‌కు రంగం సిద్ధ‌మైంది. డ‌బ్ల్యూపీఎల్ మూడో సీజ‌న్ మ‌రికొద్ది గంట‌ల్లో ఆరంభం కానుంది. యువ ప్లేయ‌ర్ల ప్ర‌తిభ‌ను వెలుగులోకి తెచ్చేందుకు, అమ్మాయిల‌కు స్ఫూర్తినిచ్చేందుకు ఈ లీగ్‌ను నిర్వ‌హిస్తున్నారు. శుక్ర‌వారం నుంచి ప్రారంభం కానున్న ఈ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా స్మృతి మంధాన సార‌థ్యంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బ‌రిలోకి దిగుతోంది.

తొలి మ్యాచ్‌లో బెంగ‌ళూరు, గుజ‌రాత్‌తో త‌ల‌ప‌డ‌నుంది. వ‌డోద‌రా వేదిక‌గా ఈ మ్యాచ్ రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్ ఆష్లీగార్డ్ నాయ‌క‌త్వంలో గుజ‌రాత్ జెయింట్స్ బ‌రిలోకి దిగ‌నుంది.

మొత్తం ఐదు జ‌ట్లు.. ముంబై ఇండియన్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ లు డ‌బ్ల్యూపీఎల్ టైటిల్ కోసం త‌ల‌ప‌డ‌నున్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌తి జ‌ట్టు మిగిలిన జ‌ట్ల‌తో రెండేసి మ్యాచ్‌లు ఆడుతాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కు చేరుకుంటుంది.

Champions Trophy 2025 : ఛాంపియన్స్‌ ట్రోఫీ వార్మప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ విడుదల.. ఆందోళ‌న‌లో టీమ్ఇండియా ఫ్యాన్స్‌.. అతి విశ్వాస‌మా!

ఇక రెండు, మూడో స్థానాల్లో నిలిచిన జ‌ట్ల మ‌ధ్య ఎలిమినేట‌ర్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇందులో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. ఫైన‌ల్ మ్యాచ్‌తో క‌లిపి మొత్తం 22 మ్యాచ్‌లు నాలుగు వేదిక‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. వడోదరలోని కోటాంబి స్టేడియం, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం, లక్నోలోని ఎకానా స్టేడియం, ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియం లు ఆతిథ్యం ఇస్తున్నాయి.

మ్యాచ్‌ల‌ను ఫ్రీగా ఎలా చూడొచ్చ‌డంటే?
డ‌బ్ల్యూపీఎల్ సీజ‌న్ 3కి సంబంధించిన‌ మ్యాచ్‌లు టీవీల్లో స్పోర్ట్స్ 18 ఛానెల్ లో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం కానుంది. ఇక ఓటీటీ విష‌యానికి వ‌స్తే.. జియో సినిమాస్‌లో ఈ మ్యాచ్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. జియో సినిమాల్లో మ్యాచ్‌ల‌ను ఉచితంగా చూడొచ్చు.

RCB : బెంగ‌ళూరు కెప్టెన్‌గా ర‌జ‌త్ పాటిదార్ ఎన్నోవాడో తెలుసా? ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్‌సీబీకి ఎంత మంది సార‌థ్యం వ‌హించారంటే?

ఏ జ‌ట్టులో ఎవ‌రు ఉన్నారంటే..?

ముంబై ఇండియన్స్..
అమంజోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, నాట్ స్కివర్-బ్రంట్, పూజా వస్త్రాకర్, సైకా ఇషాక్, యాస్తికా భాటియా, షబ్నిమ్ ఇస్మాయిల్, ఎస్ సజన, అమన్‌దీప్ కౌర్, కీర్తన బాలకృష్ణన్, జి కమలిని, నాడిన్ డి క్లర్క్, అక్షితా మహేశ్వరి, సంస్కృతి గుప్తా

గుజరాత్ జెయింట్స్..
ఆష్లీ గార్డనర్, బెత్ మూనీ, దయాళన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, తనూజా కన్వర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, మేఘనా సింగ్, కష్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, సయాలీ సత్‌గారే, సిమ్రాన్ షేక్, డియాండ్రా డాటిన్, డేనియల్ గిబ్సన్, ప్రకాశిక నాయక్.

ఢిల్లీ క్యాపిటల్స్..
అలిస్ క్యాప్సే, అరుంధతి రెడ్డి, జెమిమా రోడ్రిగ్స్, జెస్ జోనాస్సెన్, మారిజానే కప్ప్, మెగ్ లానింగ్, మిన్ను మణి, రాధా యాదవ్, షఫాలీ వర్మ, శిఖా పాండే, స్నేహ దీప్తి, తానియా భాటియా, టిటాస్ సాధు, అన్నాబెల్ సదర్లాండ్, ఎన్. చరణి, నందిని కశ్యప్, సారా బ్రైస్, నికి ప్రసాద్

Rohit Sharma : కెప్టెన్సీలో చ‌రిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ఎంఎస్ ధోని, కోహ్లీల రికార్డులు బ్రేక్‌..

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు..
స్మృతి మంధాన(కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియో వేర్‌హమ్, శ్రేయంక పాటిల్, ప్రేమ రావత్, ఆషా శోభనా, సోఫీ డివైన్, రేణుకా, జోషిత, రాఘవి బిస్త్, జాగ్రవి పవార్.

యూపీ వారియర్స్..
అలిస్సా హీలీ, అంజలి సర్వాణి, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, చమరి అతపత్తు, రాజేశ్వరి గయాక్‌వాడ్, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, బృందా దినేష్, పూనమ్ ఖేమ్నార్, సైమా థాకనా, సైమా థాకనా, అలానా కింగ్, అరుషి గోయెల్, క్రాంతి గౌడ్