RCB : బెంగళూరు కెప్టెన్‌గా రజత్ పాటిదార్ ఎన్నోవాడో తెలుసా? ఇప్పటి వరకు ఆర్‌సీబీకి ఎంత మంది సారథ్యం వహించారంటే?
ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్‌సీబీకి ఎంత మంది కెప్టెన్లుగా వ్యవహరించారంటే..

Do you know how many playesr as a Captain for RCB in IPL
ఐపీఎల్ 2025 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. రజత్ పాటిదార్‌ను సారథిగా ఎన్నుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా.. బెంగళూరు జట్టుకు ఇప్పటి వరకు ఎంత మంది సారథ్యం వహించారు అన్నదానిపై ఇప్పుడు చాలా మంది దృష్టి పడింది. రజత్ ఎన్నో వాడు అన్న సంగతులను తెలుసుకునేందుకు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2008లో ఆరంభమైంది. 17 సీజన్లు పూరైంది. ఐపీఎల్ 2025 సీజన్ 18వ సీజన్. ఇప్పటి వరకు బెంగళూరు జట్టుకు 7 గురు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇప్పుడు రజత్ 8వ వాడు.
టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి నాయకత్వంలో 14 మ్యాచ్‌లు ఆడగా బెంగళూరు కేవలం 4 మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ తరువాతి సీజన్‌లో 2009లో కెవిన్ పీటర్సన్ సారథ్యంలో బరిలోకి దిగింది. 6 మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లోనే ఆర్‌సీబీ గెలిచింది. నాలుగింటిలో ఓడిపోయింది.
దీంతో సీజన్ మధ్యలోనే దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లేకు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. అతడి నాయకత్వంలో ఆర్‌సీబీ 2009 సీజన్‌లో ఫైనల్‌కు చేరుకుంది. అయితే.. తృటిలో కప్‌ను ముద్దాడే అవకాశాన్ని చేజార్చుకుంది. ఆ సీజన్‌తో పాటు 2010 సీజన్‌కు అనిల్ కుంబ్లేనే నాయకత్వం వహించాడు. అనిల్ కుంబ్లే నాయకత్వంలో 35 మ్యాచ్‌లు ఆడగా 19 మ్యాచ్‌ల్లో గెలిచింది. 16 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
అత్యధిక కాలం పాటు ఆర్‌సీబీ కెప్టెన్‌గా కోహ్లీ..
ఇక 2011, 12 సీజన్లలో డేనియల్ వెటోరీ సారథ్యంలో ఆర్‌సీబీ ఆడింది. వెటోరి నాయకత్వంలో 2011లో ఫైనల్‌కు చేరుకున్నా మరోసారి నిరాశతప్పలేదు. వెటోరీ నాయకత్వంలో 28 మ్యాచ్‌లు ఆడగా 15 మ్యాచ్‌ల్లో గెలిచింది. 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక 2013లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎంపిక అయ్యాడు.
సుదీర్ఘ కాలం పాటు ఆర్‌సీబీకి విరాట్ నాయకత్వం వహించాడు. 2021 వరకు అతడు సారథిగా కొనసాగాడు. అతడి సారథ్యంలోనూ 2016లో ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది ఆర్‌సీబీ. అయితే.. ముచ్చటగా మూడోసారి ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. కోహ్లీ సారథ్యంలో 143 మ్యాచ్‌లు ఆడగా 66 మ్యాచ్‌లో బెంగళూరు గెలువగా 70 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే 2017లో ఓ మూడు మ్యాచ్‌ల్లో షేన్ వాట్సన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ ఓడిపోగా ఓ మ్యాచ్‌లో గెలిచింది.
కోహ్లీ తరువాత 2022లో ఫాప్ డుప్లెసిస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. మూడు సీజన్ల పాటు అంటే 2024 వరకు నాయకత్వం వహించాడు. డుప్లెసిస్ సారథ్యంలో ఆర్‌సీబీ 21 మ్యాచ్‌ల్లో గెలవగా మరో 21మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆర్‌సీబీకి అత్యధిక విజయాల శాతం (50శాతం) అందించిన కెప్టెన్‌గా డుప్లెసిస్ నిలిచాడు.
ఐపీఎల్ 2024 అనంతరం ఆర్‌సీబీ అతడిని మెగా వేలానికి విడిచిపెట్టింది. వేలంలోనూ అతడి కోసం బిడ్ దాఖలు చేయలేదు. ఇక ఐపీఎల్ 2025 సీజన్‌కు కెప్టెన్‌గా రజత్ పాటిదార్ ను తీసుకుంది.
ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఆర్‌సీబీ కెప్టెన్లు వీరే..
రాహుల్ ద్రవిడ్ – 2008లో
కెవిన్ పీటర్సన్ – 2009 సీజన్ సగం వరకు..
అనిల్ కుంబ్లే – 2009 సీజన్ మధ్య నుంచి 2010
డేనియల్ వెట్టోరి – 2011, 2012 సీజన్లు
విరాట్ కోహ్లీ – 2011 నుంచి 2023 సీజన్ వరకు
షేన్ వాట్సన్ – 2017లో మూడు మ్యాచ్‌లు
ఫాఫ్ డు ప్లెసిస్ – 2022 నుంచి 2024 వరకు
రజత్ పాటిదార్ – 2025 నుంచి…