Rohit Sharma : కెప్టెన్సీలో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఎంఎస్ ధోని, కోహ్లీల రికార్డులు బ్రేక్..
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.

PIC credit @ BCCI
ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ వైట్‌వాష్ చేసింది. ఈ క్రమంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన భారత కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీల రికార్డులను బద్దలు కొట్టాడు.
రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఇప్పటి వరకు నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసింది. అది కూడా నాలుగు వేర్వేరు జట్లపై కావడం విశేషం.
IND vs ENG : ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్.. బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఎవరికో తెలుసా?
రోహిత్ శర్మ సారథ్యంలో వన్డేల్లో భారత్ క్వీన్ స్వీప్ చేసిన జట్లు ఇవే..
2022లో వెస్టిండీస్ పై
2023లో శ్రీలంక పై
2023 న్యూజిలాండ్ పై
2025లో ఇంగ్లాండ్ పై
గతంలో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీలు చెరో మూడు సార్లు ప్రత్యర్థులను వైట్‌వాష్ చేశారు.
ఇప్పటి వరకు రోహిత్ శర్మ వన్డేల్లో 51 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. ఇందులో భారత్ 37 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరో 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ టైగా ముగియగా మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 72.54 విజయశాతంతో రోహిత్ కొనసాగుతున్నాడు.
PAK vs SA : ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రత్యర్థులకు వార్నింగ్ పంపిన పాకిస్తాన్..
ROHIT SHARMA AS AN ODI CAPTAIN:
Matches – 51
Won – 37
Loss – 12
Tie – 1
No Result – 1
Winning Percentage – 72.54One of the Greatest Captains ever 🇮🇳 pic.twitter.com/lihNNETgf1
— Johns. (@CricCrazyJohns) February 13, 2025
14 ఏళ్ల వన్డే క్రికెట్ లో తొలి జట్టుగా భారత్..
వన్డే క్రికెట్‌లో గత 14 ఏళ్లలో అత్యధిక క్లీన్‌స్వీప్ చేసిన జట్టుగా భారత్ నిలిచింది. 14 ఏళ్లలో 12 సార్లు వన్డే సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. భారత్ తరుపున న్యూజిలాండ్ 10 క్లీన్‌స్వీప్‌లతో రెండో స్థానంలో ఉంది.