PAK vs SA : ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రత్యర్థులకు వార్నింగ్ పంపిన పాకిస్తాన్..
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తన ఆటతీరుతో పాకిస్తాన్ ప్రత్యర్థులకు వార్నింగ్ పంపింది.

Pakistan won by 6 wickets against South Africa and enter into tri series final
మరో వారం రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. పాకిస్తాన్ ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఎంత ప్రమాదకర జట్టో క్రికెట్ ప్రపంచానికి మరోసారి చూపించింది. ట్రై సిరీస్‌లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. కెప్టెన్ టెంబా బవుమా (82; 96 బంతుల్లో 13 ఫోర్లు), మాథ్యూ బ్రిట్జ్‌కీ (83; 84 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), హెన్రీచ్ క్లాసెన్ (87; 56 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీశాడు. నసీమ్ షా, కుష్‌దిల్ షా చెరో వికెట్ పడగొట్టాడు.
IPL 2025 : RCB కెప్టెన్‌గా రజత్ పాటిదార్..! అఫీషియల్‌గా ప్రకటించడమే మిగిలి ఉందా?
🚨 HISTORY CREATED IN KARACHI. 🚨
Pakistan chased down 353 Vs South Africa – their highest successful chase in ODIs. 🤯 pic.twitter.com/J0ErItwX9M
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 12, 2025
అనంతరం సల్మాన్ అఘా(134; 103 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్(122 నాటౌట్; 128 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాలతో చెలరేగడంతో 353 పరుగుల భారీ లక్ష్యాన్ని పాకిస్తాన్ 49 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫఖర్ జమాన్ (41; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజాం (23; 19 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు.
లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 91 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును సల్మాన్ అఘాతో కలిసి కెప్టెన్ రిజ్వాన్ ఆదుకున్నాడు. వీరిద్దరు దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ శతకాలతో చెలరేగారు. వీరిద్దరు నాలుగో వికెట్ 260 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా.. వన్డేల్లో పాకిస్తాన్‌కు ఇదే అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం.
ఈ విజయంతో పాకిస్తాన్ ట్రై సిరీస్ ఫైనల్ చేరుకుంది. ఫిబ్రవరి 14 శుక్రవారం న్యూజిలాండ్‌తో ఫైనల్ ఆడనుంది.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. 8 జట్లు బరిలోకి దిగతుండగా వాటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లు ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌లు ఉన్నాయి. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది.