IND vs ENG : ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్.. బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఎవరికో తెలుసా?
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో బెస్ట్ ఫీల్డర్ అవార్డును ఎవరు ఎవరికి ఇచ్చారో తెలుసా

IND vs ENG ODI Series Vice Captain Gill handed the Best fielding medal to Iyer
ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్వీన్‌స్వీప్ చేసింది. భారత జట్టు సిరీస్ విజయంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కీలక పాత్రను పోషించాడు. కోహ్లీ మోకాలికి వాపు రావడంతో అనూహ్యంగా తొలి వన్డేలో చోటు దక్కించుకున్న అయ్యర్ తన విధ్వంసకర ఆటతో జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తొలి వన్డేలో 59, రెండో వన్డేలో 44 పరుగులు చేయగా ఇక మూడో వన్డేలో ఏకంగా 78 పరుగులు సాధించాడు.
మొత్తంగా మూడు వన్డేల్లో 60.33 సగటు 123.12 స్ట్రైక్ రేట్‌తో 181 పరుగులు చేశాడు ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు అయ్యర్ గొప్ప ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసివచ్చే అంశం. ఇక ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో తన ప్రదర్శన పై మూడో వన్డే మ్యాచ్ అనంతరం అయ్యర్ స్పందించాడు. భారత జట్టుకు దూరంగా ఉండడం తనకు కలిసి వచ్చిందన్నాడు. ఈ విరామంలో దేశవాళీ క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్రతీ బంతి కట్, ఫుల్ షాట్ ఆడకుండా.. స్ట్రైక్ రొటేట్ చేయడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. అదే సమయంలో డ్రాప్-ఇన్ షాట్స్‌తో సింగిల్స్ తీయడం నేర్చుకున్నాను అని చెప్పాడు.
PAK vs SA : ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రత్యర్థులకు వార్నింగ్ పంపిన పాకిస్తాన్..
🚨 SHREYAS IYER – BEST FIELDER OF THE SERIES 🚨
Vice Captain Gill handed the Best fielding medal to Iyer 🏅 pic.twitter.com/3GMNNX6Vj7
— Johns. (@CricCrazyJohns) February 13, 2025
శరీరానికి దగ్గరగా వచ్చే బంతులను సింగిల్స్‌గా మలచడం తనకు సంతృప్తి నిచ్చిందన్నాడు. తొలి వన్డేలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో ధాటిగా ఆడి మూమెంట్‌ను తీసుకురావాలని భావించానని, తన బలాలను నమ్ముకునే పరుగులు రాబట్టే ప్రయత్నం చేసినట్లు వివరించాడు. ఇక రెండో వన్డేలో మ్యాచ్‌ను సాధ్యమైనంత వేగంగా ముగించాలని భావించి అందుకు తగ్గట్లునే బ్యాటింగ్ చేశానన్నాడు.
ఇక మూడో వన్డేలో తాను క్రీజులోకి వచ్చే సమయానికి గిల్, విరాట్ మంచి ఫ్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశారని, అది తనకు ఎంతో ఉపయోగపడిందన్నారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే ఇంకా బాగుండేదన్నారు. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి జోష్ ఉందన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆటగాళ్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారని చెప్పాడు. ఇక తనకు బెస్ట్ ఫీల్డర్ అవార్డ్ వస్తుందని భావిస్తున్నట్లుగా తెలిపాడు.
బెస్ట్ ఫీల్డర్ అవార్డు..
మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్ ప్రదర్శన చేసిన వారిని ప్రోత్సహించేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ బెస్ట్ ఫీల్డర్ మెడల్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ సిరీస్ అనంతరం ఆ సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు దీన్ని అందిస్తూ వస్తున్నారు. ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో చక్కటి ప్రదర్శన కనబరడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్‌ను ఈ సారి ఈ అవార్డు వరించింది. డ్రెస్సింగ్‌రూమ్‌లో టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేతుల మీదుగా అయ్యర్ మెడల్‌ను అందుకున్నాడు.