IPL 2025 : రజత్ పాటిదార్‌ను ఎవరు? కృనాల్, భువనేశ్వర్ లను కాదని ఆర్‌సీబీ యాజమాన్యం అతడినే కెప్టెన్‌గా ఎందుకు ఎంపిక చేసింది?
బెంగళూరు కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌నే ఎందుకు నియమించారంటే..

Who is Rajat Patidar why he should be the new Captain RCB
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి కొత్త నాయకుడు వచ్చాడు. కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో బెంగళూరు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరీ పాటిదార్..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 1993 జూన్ 1 జన్మించాడు రజత్ పాటిదార్. తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌ను 2015-16లో మధ్యప్రదేశ్ తరుపున ప్రారంభించాడు. తన అరంగ్రేట మ్యాచ్‌లోనే కాకుండా ఆ తరువాతి మ్యాచ్‌లోనూ శతకాలతో దుమ్మురేపాడు. 2022లో మధ్యప్రదేశ్ జట్టు తొలిసారి రంజీట్రోఫీ విజేతగా నిలిచింది. ముంబైతో జరిగిన నాటి ఫైనల్ మ్యాచ్‌లో రజత్ శతకంతో చెలరేగి జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్‌ను అందించాడు.
A new chapter begins for RCB and we couldn’t be more excited for Ra-Pa! 🤩
From being scouted for two to three years before he first made it to RCB in 2021, to coming back as injury replacement in 2022, missing out in 2023 due to injury, bouncing back and leading our middle… pic.twitter.com/gStbPR2fwc
— Royal Challengers Bengaluru (@RCBTweets) February 13, 2025
30వ వయసులో భారత జట్టులోకి అడుగుపెట్టాడు. ఓ వన్డే మ్యాచ్, మూడు టెస్టుల్లో మాత్రమే భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేల్లో 22 పరుగులు చేయగా టెస్టుల్లో 63 పరుగులు మాత్రమే చేశాడు.
ఐపీఎల్‌లో అదుర్స్..
అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలాగున్నా సరే.. ఐపీఎల్‌లో మాత్రం పాటిదార్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 2021లో అతడు ఆర్‌సీబీ ద్వారా ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. ఆ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం రాగా.. 71 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో 2022 సీజన్‌కు ముందు ఆర్‌సీబీ అతడిని విడిచిపెట్టింది. అయితే.. 2022లో సీజన్‌లో ఓ ఆటగాడు గాయపడడంతో పాటిదార్‌కు అదృష్టం కలిసివచ్చింది. గాయపడిన ఆటగాడి స్థానంలో పాటిదార్‌ను బెంగళూరు తీసుకుంది. ఈ సీజన్‌లో ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై 54 బంతుల్లోనే 112 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అతడి పేరు మారిమోగిపోవడంతో పాటు ఆర్‌సీబీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
2022 సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 55.50 సగటుతో 333 పరుగులు చేశాడు. అయితే.. గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్‌కు దూరం అయ్యాడు. ఇక ఐపీఎల్ 2024 సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన అతడు 30.37 సగటుతో 395 పరుగులు చేశాడు. మొత్తంగా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 27 మ్యాచ్‌లు ఆడాడు. 34.73 సగటు 158.44 స్ట్రైక్‌రేటుతో 799 పరుగులు సాధించాడు.
రజత్‌నే ఎందుకు..?
గత రెండు సీజన్లలో జట్టును నడిపించిన దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఫాప్ డుప్లెసిస్‌ను ఈ సారి ఆర్‌సీబీ రిటైన్ చేసుకోలేదు. అంతేకాదండోయ్ అతడి కోసం కనీసం బిడ్ కూడా వేయలేదు. దీంతో కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ జట్టుతోనే ఉన్నప్పటికి అతడు నాయకత్వ బాధ్యతలను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. మరోవైపు వేలంలో దక్కించుకున్న కృనాల్ పాండ్యా, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ లు సైతం కెప్టెన్సీ రేసులో ఉన్నారు.
IND vs ENG : ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్.. బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఎవరికో తెలుసా?
అయితే.. వీరిద్దరు కూడా ఈ సారే జట్టుతో చేరారు. రజత్ పాటిదార్ 2021 నుంచి ఆర్‌సీబీ జట్టుతోనే ఉన్నాడు. జట్టు నిర్మాణం ఎలా ఉంటుంది. మేనేజ్‌మెంట్ ఆకాంక్షలు వంటి విషయాలపై అతడి అవగాహన ఉంది. అంతేకాకుండా అతడు చాలా నిలకడగా పరుగులు చేస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకుని అతడే సరైన సారథి అని మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని ఉంచింది. ఈ క్రమంలోనే అతడి సారథ్య బాధ్యతలు అప్పగించింది. రజత్ వయసు 31 ఏళ్లు. దీంతో అతడు కనీసం మరో మూడు నాలుగు సీజన్ల పాటు కెప్టెన్సీ నిర్వర్తించే అవకాశం ఉంది.
కెప్టెన్సీ అనుభవం..
పాటిదార్‌కు కొంత కెప్టెన్సీ అనుభవం ఉంది. 2024-2025 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మధ్యప్రదేశ్‌కు నాయకత్వం వహించాడు. తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 428 పరుగులతో టోర్నీలో రెండో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగానూ నిలిచాడు. అతడి నాయకత్వ లక్షణాలు నచ్చే అతడిని బెంగళూరు కెప్టెన్‌గా నియమించినట్లు కోచ్ ఆండీ ఫ్లవర్ వెల్లడించారు.
చూడాలి మరీ గత 17 సీజన్లుగా బెంగళూరుకు అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ టైటిల్‌ను రజత్ అందిస్తాడో లేదో.