చెలరేగిన కివీస్ బ్యాట్స్‌మెన్, టీమిండియా టార్గెట్ 220

వన్డే ఫార్మాట్ అనంతరం ఆరంభమైన టీ20 సిరీస్‌ను భారీగా ఆరంభించింది కివీస్. టీమిండియాకు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌పై కివీస్ ఓపెనర్లు విరుచుకుపడ్డారు. ఆరంభంలో కాస్త దూకుడు చూపించినా క్రమంగా పరుగుల వేగం తగ్గింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన టిమ్ సీఫెర్ట్(84) 43 బంతుల్లో; 7ఫోర్లు, 6 సిక్సులతో జట్టుకే హైలెట్‌గా నిలిచాడు. ఆఖరి వికెట్‌గా క్రీజులోకి వచ్చిన స్కాట్ కగ్లీజెన్ కూడా ధాటిగా ఆడి 7 బంతుల్లో 20 పరుగులు చేశాడు.  

వికెట్లు తీయడంలో అంతగా రాణించలేకపోయిన భారత బౌలర్లు చాహల్, కృనాల్, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ తలో వికెట్ తీయగా, హార్దిక్ పాండ్యా మాత్రమే 2 వికెట్లు తీయగలిగాడు.