IND vs WI ODI Series: సచిన్ రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొడుతాడా?

వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్ 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రెండు రికార్డులను బద్దలు కొట్టేందుకు దగ్గరగా ఉన్నాడు.

IND vs WI ODI Series: వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్ ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రెండు రికార్డులను బద్దలు కొట్టేందుకు దగ్గరగా ఉన్నాడు. ఈ వన్డే సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ రికార్డును కూడా బద్దలు కొట్టేయొచ్చు.

వెస్టిండీస్‌పై రోహిత్ శర్మ ఇప్పటివరకు 1523 పరుగులు చేయగా.. వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు రోహిత్ పేరిట ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో 51 పరుగులు చేస్తే, విండీస్ జట్టుపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు అవుతాడు.

ప్రస్తుతం ఈ విషయంలో సచిన్ టెండూల్కర్ 1573 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌పై కోహ్లీ 2235 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు.

వెస్టిండీస్‌పై రోహిత్ శర్మ ఇప్పటివరకు మూడు సెంచరీలు చేయగా.. మరో 2 సెంచరీలు సాధిస్తే, విండీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా సచిన్ టెండూల్కర్(4 సెంచరీలు)ని దాటేయొచ్చు. ఈ విషయంలోనూ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. విండీస్‌పై వన్డేల్లో కోహ్లీ 9 సెంచరీలు చేశాడు.

భారత్ తరఫున వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా..
రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో 9205 పరుగులు సాధించే అవకాశం ఉంది. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఏడో స్థానంలో ఉన్నాడు. అతని కంటే ముందు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఉన్నాడు. అజారుద్దీన్‌ పేరిట వన్డేల్లో 9378 పరుగులు ఉన్నాయి. అంటే విండీస్‌పై రోహిత్ 174 పరుగులు చేస్తే అజారుద్దీన్‌ని వెనక్కి నెట్టి ఆరో స్థానానికి చేరుకుంటాడు రోహిత్ శర్మ.

ట్రెండింగ్ వార్తలు