Premier Handball League : సెమీస్‌లో అడుగుపెట్టిన తెలుగు టాలన్స్‌

ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్ లీగ్‌(PHL)లో తెలుగు టాలన్స్(Telugu Talons) దూసుకుపోతుంది. మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే సెమీస్‌లో అడుగుపెట్టింది.

TT vs GEU

Premier Handball League 2023 : ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్ లీగ్‌(PHL)లో తెలుగు టాలన్స్(Telugu Talons) దూసుకుపోతుంది. మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆదివారం జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ ఇండోర్‌ స్టేడియంలో జ‌రిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో గోల్డెన్‌ ఈగల్స్‌ ఉత్తరప్రదేశ్‌( Golden Eagles Uttar Pradesh)పై తెలుగు టాల‌న్స్ విజ‌యం సాధించింది. ఆఖ‌రి నిమిషం వ‌రకు నువ్వా నేనా అన్న‌ట్లుగా సాగిన మ్యాచ్‌లో 26-25తో ఒక్క గోల్ తేడాతో టాల‌న్స్ విజ‌యాన్ని అందుకుంది. ఈ సీజ‌న్‌లో గ్రూప్ ద‌శ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన టాల‌న్స్‌కు ఇది ఆరో విజ‌యం. గ్రూప్ ద‌శలో మ‌రో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండ‌గానే సెమీస్ బెర్తును టాల‌న్స్ ఖాయం చేసుకుంది.

James Anderson : జేమ్స్ అండ‌ర్స‌న్ అరుదైన ఘ‌న‌త‌.. 1100 వికెట్ల క్ల‌బ్‌లో చేరిక‌

TT vs GEU

Indonesia Open : ఇండోనేషియా ఓపెన్‌లో చ‌రిత్ర సృష్టించిన‌ సాత్విక్-చిరాగ్ జోడి

మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జ‌ట్లు పోటాపోటీగా త‌ల‌ప‌డ్డాయి. చెరో గోల్స్ చేస్తూ ప్ర‌థ‌మార్థం ముగిసే స‌రికి 14-14 తో టాల‌న్స్‌, ఈగ‌ల్స్ స‌మంగా నిలిచాయి. ఇక ద్వితియార్థం ఆరంభంలో టాల‌న్స్ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. దీంతో 18-15 తో ముందంజ‌లో నిలిచింది. అయితే.. ఆ వెంట‌నే ఈగ‌ల్స్ పుంజుకుంది. 18-18 తో స‌మం చేసింది. చివ‌రి ప‌ది నిమిషాల్లో ఆధిక్యం చేతులు మారుతూ వ‌చ్చింది. అయితే.. కీల‌క స‌మ‌యంలో గోల్స్ చేసిన టాల‌న్స్ 25-22తో ముందంజ‌లో నిలిచింది. ఆఖ‌రి వ‌ర‌కు ప‌ట్టు వ‌ద‌ల‌కుండా పోరాడిన ఈగ‌ల్స్ పోరాడింది. చివ‌రికి గోల్ తేడాతో టాల‌న్స్ విజ‌యాన్ని అందుకుంది. ఈ సీజ‌న్‌లో టాల‌న్స్‌కు ఇది వ‌రుస‌గా నాలుగో విజ‌యం కాగా ఈగ‌ల్స్‌కు ఇది ఐదో ప‌రాజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం.