×
Ad

Temba Bavuma : చరిత్ర సృష్టించిన బవుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఏకైక కెప్టెన్‌..

దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బ‌వుమా (Temba Bavuma ) టెస్టుల్లో అద‌ర‌గొడుతున్నాడు.

Temba Bavuma Becomes First Player In 148 Years To Achieve Stunning Feat As Captain

Temba Bavuma : దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బ‌వుమా టెస్టుల్లో అద‌ర‌గొడుతున్నాడు. త‌న అద్భుత కెప్టెన్సీతో 15 ఏళ్ల త‌రువాత భార‌త గ‌డ్డ‌పై ద‌క్షిణాఫ్రికాకు టెస్టు విజ‌యాన్ని అందించాడు. 124 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్ 93 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. దీంతో కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో స‌ఫారీలు 30 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకున్నారు.

ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం ద్వారా బ‌వుమా (Temba Bavuma) ఓ అరుదైన ఘ‌న‌తను అందుకున్నాడు. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా కెప్టెన్‌గా అత్య‌ధిక విజ‌యాలు అందించిన సార‌థిగా చరిత్ర సృష్టించాడు. 2022లో టెస్టుల్లో ద‌క్షిణాఫ్రికాకు బ‌వుమా సార‌థిగా ఎంపిక అయ్యాడు.

IPL 2026 : మ‌రోసారి రాజ‌స్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా కుమార సంగక్కర.. కోచింగ్ బృందంలో కీల‌క మార్పులు..

తాజా మ్యాచ్‌తో క‌లిపి అత‌డి నాయ‌క‌త్వంలో స‌ఫారీలు 11 టెస్టులు ఆడారు. ఇందులో 10 మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా విజ‌యాల‌ను సాధించింది. ఇందులో ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ 2023-25 ఫైన‌ల్ మ్యాచ్ కూడా ఉంది. ఇక మిగిలిన ఆ ఒక్క మ్యాచ్ డ్రా అయింది.

టెస్టుల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అత్య‌ధిక విజ‌యాల‌ను అందించిన కెప్టెన్లు వీరే..

* టెంబా బ‌వుమా (ద‌క్షిణాఫ్రికా) – 11 మ్యాచ్‌ల్లో 10 విజ‌యాలు
* వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (ఆస్ట్రేలియా) – 10 మ్యాచ్‌ల్లో 8 విజ‌యాలు
* బ్రియాన్ క్లోజ్ (ఇంగ్లాండ్‌) – 7 మ్యాచ్‌ల్లో 6 విజ‌యాలు
* చార్లెస్ పై (ఇంగ్లాండ్‌) – 6 మ్యాచ్‌ల్లో 4 విజ‌యాలు