IPL 2026 : మ‌రోసారి రాజ‌స్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా కుమార సంగక్కర.. కోచింగ్ బృందంలో కీల‌క మార్పులు..

ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు (IPL 2026) ముందు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది

IPL 2026 : మ‌రోసారి రాజ‌స్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా కుమార సంగక్కర.. కోచింగ్ బృందంలో కీల‌క మార్పులు..

Rajasthan Royals announce Kumar Sangakkara as head coach ahead of IPL 2026

Updated On : November 17, 2025 / 2:22 PM IST

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు ముందు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ కోచింగ్ సిబ్బందిలో ప‌లు మార్పులు చేసింది. త‌మ జ‌ట్టు హెడ్ కోచ్‌గా తిరిగి కుమార సంగ‌క్క‌ర‌ను నియ‌మించింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. 2021 నుంచి 2024 వ‌ర‌కు సంగ‌క్క‌ర‌ ఆర్ఆర్‌కు హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. అయితే… 2025లో రాహుల్ ద్ర‌విడ్ రాజ‌స్థాన్ హెడ్‌కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డంతో సంగ‌క్క‌ర ను రాయ‌ల్స్ క్రికెట్ డైరెక్ట‌ర్‌గా నియ‌మించారు.

ఐపీఎల్ 2025 సీజ‌న్ ముగిసిన త‌రువాత రాహుల్ ద్ర‌విడ్ హెడ్ కోచ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నాడు. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి సంగ‌క్క‌ర హెడ్‌కోచ్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించ‌నున్నాడు. కాగా.. సంగ‌క్క‌ర మార్గ‌నిర్దేశ్యంలో ఆర్ఆర్ నాలుగు సార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.

Team India : కోల్‌క‌తాలో ఓట‌మి.. భార‌త్‌కు ఇంత న‌ష్టం జ‌రిగిందా? కోలుకోవ‌డం క‌ష్ట‌మేనా?

బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న విక్రమ్ రాథోడ్‌ను ప్ర‌ధాన‌ అసిస్టెంట్ కోచ్‌గా ప్రమోట్ చేశారు. ఇంగ్లాండ్ మాజీ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్ ట్రెవ‌ర్ పెన్నీ తిరిగి అసిస్టెంట్ కోచ్‌గా, సిడ్ లాహిరి పెర్ఫార్మెన్స్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. న్యూజిలాండ్ దిగ్గ‌జ ఆట‌గాడు షేన్ బాండ్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగనున్నాడు.

కెప్టెన్ ఎవ‌రు?

రెగ్యుల‌ర్ కెప్టెన్ సంజూ శాంస‌న్ ఐపీఎల్ 2026 (IPL 2026) మినీ వేలాని క‌న్నా ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ ట్రేడింగ్‌లో తీసుకుంది. దీంతో ఆర్ఆర్ కు కొత్త కెప్టెన్ ఎవ‌రు అన్న ఆస‌క్తి అంద‌రిలో ఉంది.

IND vs SA : పుజారాకు కోప‌మొచ్చింది.. స్వ‌దేశంలో ఓడిపోతారా ? ఆ పని చేసుంటే గెలిచేవాళ్లం క‌దా!

 

View this post on Instagram

 

A post shared by Rajasthan Royals (@rajasthanroyals)

ఐపీఎల్ 2025లో సంజూ శాంస‌న్ గాయంతో కొన్ని మ్యాచ్‌ల‌కు దూర‌మైన సంద‌ర్భంలో రియాన్ ప‌రాగ్ రాజ‌స్థాన్‌కు నాయ‌క‌త్వం వ‌హించాడు. అత‌డితో పాటు య‌శ‌స్వి జైస్వాల్, ట్రేడింగ్‌లో చెన్నై నుంచి వ‌చ్చిన‌ ర‌వీంద్ర జ‌డేజా వంటి ఆట‌గాళ్లు నాయ‌క‌త్వ రేసులో ఉన్నారు.