India vs Pak Match: దాయాది జట్ల మధ్య పోరు.. అక్కడ నిమిషాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఇరుజట్ల మధ్య నువ్వానేనా అన్నట్లు సాగే పోరును ఎక్కువగా స్టేడియంకు వెళ్లి వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తారు.

India vs Pak Match: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఇరుజట్ల మధ్య నువ్వానేనా అన్నట్లు సాగే పోరును వీక్షించేందుకు ఎక్కువగా స్టేడియంకు వెళ్లి వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక టీ20 వరల్డ్‌కప్ లాంటి పెద్ద టోర్నీల్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే ఇక టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు‌పోతాయి. త్వరలో జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌లో ఈ రెండు జట్లు తలపడే మ్యాచ్‌కు నిమిషాల వ్యవధిలో టికెట్లు అమ్ముడు పోయాయి.

India Vs Pakistan : తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‍తో భారత్ ఢీ.. వరల్డ్ కప్‌లో టీమిండియా షెడ్యూల్

ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న టీ20 పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌ -2022 టోర్నీ అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభంకానుంది. 16 నుంచి 21 వరకు ఫస్ట్ రౌండ్(క్వాలిఫైయింగ్) మ్యాచ్‌లు జరగుతాయి. టోర్నీలో భాగంగా సూపర్ 12 దశలో అక్టోబర్‌ 23న దాయాది జట్లు పాకిస్థాన్‌, టీమిండియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు టికెట్లు, అడిషనల్ స్టాండింగ్ రూమ్ టికెట్లు మొత్తం నిమిషాల్లో అమ్ముడు పోయాయంట. ఈ టోర్నీకి ముందు అధికారికంగా టికెట్ల రీసేల్ విక్రయ వేదికను ప్రారంభిస్తామని, అక్కడ అభిమానులు అసలు ధరకు టికెట్లను మార్చుకోవచ్చని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

ICC T20 Rankings: ఒక్క సెంచరీతో దూసుకొచ్చిన కోహ్లీ.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి టాప్-10లో సూర్యకుమార్ ఒక్కడే ..

ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ -2022 అన్నివర్గాల అభిమానులకు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఐదు లక్షల మంది తమ సీట్లను రిజర్వు చేసుకున్నారు. మొత్తం 82 దేశాల నుంచి అభిమానులు ఈ టోర్నమెంట్ ను వీక్షించేందుకు హాజరు అవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు