Viral Video : నాలుకతో విరాట్ కోహ్లీ బొమ్మ గీసిన ఆర్టిస్ట్.. అలా వేయడం తప్పంటున్న నెటిజన్లు

ఆర్టిస్ట్‌లు రకరకాల బొమ్మలు గీస్తుంటారు. కానీ నాలుకతో ఓ క్రికెటర్ బొమ్మను గీసాడు ఓ ఆర్టిస్ట్. అతని టాలెంట్‌ని మెచ్చుకుంటున్న నెటిజన్లు వేసిన పద్ధతి బాగాలేదని పెదవి విరిచారు.

Viral Video

Viral Video : క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారిలో ఒక వీరాభిమాని కోహ్లీ చిత్రాన్ని గీసాడు. అతని టాలెంట్ మెచ్చుకునేలా ఉన్నా.. అతను వేసిన విధానం చాలామందికి నచ్చలేదు. నాలుకతో ఆ ఆర్టిస్ట్ విరాట్ బొమ్మను గీసాడు.

Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. క్రికెట్ దేవుడి రికార్డు బ్రేక్‌..

ముఫద్దల్ వోహ్రా (@mufaddal_vohra) అనే ట్విట్టర్ యూజర్ ఓ గుర్తు తెలియని ఆర్టిస్ట్ తన నాలుక కొనలను ఉపయోగించి విరాట్ కోహ్లీ చిత్రాన్ని గీసే వీడియోను షేర్ చేసాడు. ఈ క్లిప్ వైరల్ అవుతోంది. ‘విరాట్ కోహ్లీని ఓ అభిమాని తన నాలుకతో కళాత్మకంగా తీర్చిదిద్దాడు’ అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లు ఆ విచిత్రమైన పెయింట్ రుచి గురించి అడిగారు. కొందరు అతని టాలెంట్‌ను మెచ్చుకుంటే మరికొందరు పెదవి విరిచారు.

Virat Kohli : సూర‌త్ వ్యాపార వేత్త అభిమానం.. విరాట్ కోహ్లీకి గిఫ్ట్‌గా వజ్రాల బ్యాటు..!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి ‘ప్రతిభావంతుడైన వ్యక్తి’ అని.. ‘పెయింటింగ్ పెర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నా అతను వేసిన విధానం సరిగా లేదని’ ట్విట్టర్‌లో చాలామంది కామెంట్లు పెట్టారు.