IPL 2025: ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే RCBనే IPL టైటిల్ విన్నర్..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కు వెళ్లింది.

Pic: @IPL (X)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచులో పంజాబ్ కింగ్స్ పై గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.

క్వాలిఫయర్ 1లో విజేతగా నిలుస్తున్న జట్లే గత ఏడు ఫైనల్స్‌లో గెలిచాయి. 2018 నుంచి 2024 ఐపీఎల్‌ సీజన్లు అన్నింటిలోనూ ఇదే జరిగింది. ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈ సారి ఆర్సీబీనే ఐపీఎల్‌ టైటిల్ విన్నర్‌గా నిలుస్తుంది.

Also Read: ట్రంప్‌కి మస్క్ గుడ్ బై కొట్టడానికి కారణం ఇదే… ఏంటి ఈ “బిగ్ బ్యూటిఫుల్ బిల్”?

గత ఏడు సీజన్‌లలో క్వాలిఫయర్ 1లో గెలిచి ఫైనల్‌లోనూ గెలిచిన జట్లు ఇవే

2018: CSK (క్వాలిఫయర్ 1 గెలిచింది)
2019: MI (క్వాలిఫయర్ 1 గెలిచింది)
2020: MI (క్వాలిఫయర్ 1 గెలిచింది)
2021: CSK (క్వాలిఫయర్ 1 గెలిచింది)
2022: GT (క్వాలిఫయర్ 1 గెలిచింది)
2023: CSK (క్వాలిఫయర్ 1 గెలిచింది)
2024: KKR (క్వాలిఫయర్ 1 గెలిచింది)

ఇప్పుడు ఆర్సీబీ క్వాలిఫయర్ 1లో గెలిచింది. దీంతో గత ఏడు సీజన్‌లలోని సెంటిమెంట్‌ ఈ సారి కూడా రిపీట్ అవుతుందని, ఆర్సీబీనే కప్‌ కొడుతుందని ఆ జట్టు అభిమానులు అంటున్నారు.

కాగా, నిన్న జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచులో పంజాబ్‌ కింగ్స్‌ను ఆర్సీబీ చిత్తు ఓడించి, తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. 85 బంతుల్లోనే పంజాబ్‌ జట్టును ఆలౌట్‌ చేసిన ఆర్సీబీ.. లక్ష్య ఛేదనలో 60 బంతుల్లోనే టార్గెట్ పూర్తి చేసింది.

నిన్నటి మ్యాచులో పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో 101 ఆలౌట్ కాగా, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 10 ఓవర్లలో 106/2 పరుగులు చేసి గెలుపొందింది.