×
Ad

ఏం కొట్టారు భయ్యా.. పాండ్యా రికార్డు.. తిలక్ వర్మ బౌండరీల వర్షం

హార్దిక్ పాండ్యా 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ కొట్టాడు. 

India vs South Africa: భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య గుజరాత్‌, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోన్న ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 231/5 స్కోరు చేసింది. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలు బాదారు.

హార్దిక్ పాండ్యా 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ కొట్టాడు. దీంతో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ బాదిన భారత రెండో ప్లేయర్‌గా నిలిచాడు. 2007 ప్రపంచ కప్‌లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. (India vs South Africa)

నేటి మ్యాచ్‌లో సంజూ శాంసన్ 37, అభిషేక్ శర్మ 34, సూర్యకుమార్ యాదవ్ 5, తిలక్ వర్మ 73, హార్దిక్ పాండ్యా 63, శివం దూబె 6, జితేశ్ శర్మ 0 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బోష్ 2.. ఓట్నీల్ బార్ట్‌మన్, జార్జ్ లిండే తలో వికెట్ పడగొట్టారు.

ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్‌ ఇప్పటికే 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. నేటి మ్యాచ్‌ గెలిస్తే సిరీస్ మనదే.