Tilak Varma Comments on scoring two centuries in South Africa
Tilak Varma : టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ దక్షిణాప్రికా గడ్డపై వరుసగా రెండు టీ20 మ్యాచుల్లోనూ రెండు శతకాలు బాదాడు. నాలుగు మ్యాచుల టీ20 సిరీస్ లో 280 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు. నాలుగో టీ20 మ్యాచ్‌లో శతకంతో చెలరేడంతో ప్లేయర్ ఆఫ్ మ్యాచ్‌గానూ నిలిచాడు. ఇక మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
దక్షిణాఫ్రికా పై వరుసగా రెండు సెంచరీలు చేయడం పై మాట్లాడుతూ తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఓ సరదా విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. గతేడాది ఇదే వేదిక (జోహెన్నెస్‌బర్గ్) వేదికగా ఆడిన టీ20 మ్యాచులో తాను తొలి బంతికే డకౌట్ అయిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో మరోసారి అవకాశం వస్తే మాత్రం తనను తాను నిరూపించుకోవాలని అనుకున్నట్లు చెప్పాడు.
IPL Auction 2025 : ఐపీఎల్ మెగా వేలం షార్ట్ లిస్ట్ రిలీజ్.. మెగా వేలంలో 13 ఏళ్ల కుర్రాడు..
ఇప్పుడు నాలుగో టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో ఆ లోటును భర్తీ చేసుకున్నట్లు చెప్పాడు. టీమ్ఇండియా విజయం సాధించిన మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. మూడో టీ20 మ్యాచ్‌లో ఎలా ఆడానో నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ అవే సూత్రాలకు కట్టుబడి బ్యాటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు మరోసారి ధన్యవాదాలు తెలియజేశాడు.
ఈ సిరీస్‌కు ముందు గాయాల కారణంగా తిలక్ వర్మ కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ కోలుకుని మైదానంలోకి దిగేందుకు ఎంతో శ్రమించినట్లుగా చెప్పాడు. అందుకే సెంచరీ అనంతరం అలా సంబరాలు చేసుకున్నట్లు తెలిపాడు.
SA vs IND : తెలుగు తేజం తిలక్ వర్మ అద్భుత శతకం.. కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఆనందం చూశారా..?
4 innings
280 runs 🙌Two outstanding 🔙 to 🔙 T20I Hundreds 💯
Tilak Varma is named the Player of the Series 🥳
Scorecard – https://t.co/b22K7t9imj#TeamIndia | #SAvIND | @TilakV9 pic.twitter.com/JoEED4Z3Ij
— BCCI (@BCCI) November 15, 2024