×
Ad

IND vs NZ Series : కివీస్‌తో టీ20 సిరీస్ వేళ టీమిండియాకు తిలక్ వర్మ రూపంలో బిగ్‌షాక్..

ND vs NZ Series : న్యూజిలాండ్ జట్టుతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌తో ఉన్న భారత జట్టు బ్యాటర్ తిలక్ వర్మకు గాయమైంది.

Tilak Varma

IND vs NZ Series : న్యూజిలాండ్ జట్టుతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌తో ఉన్న భారత జట్టు బ్యాటర్ తిలక్ వర్మకు గాయమైంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అతనికి వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం తిలక్ వర్మ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉంది. అయితే, అతను కోలుకోవడానికి మూడు, నాలుగు వారాలు పడుతుంది. దీంతో అతను కివీస్ తో జరిగే టీ20 సిరీస్ కు అదుబాటులో ఉండే అవకాశం లేదు.

Also Read : Rohit Sharma : రోహిత్ భ‌య్యా.. వ‌డాపావ్ కావాలా..? హిట్‌మ్యాన్ ఆన్స‌ర్ అదుర్స్..

న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో జరిగే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ దూరమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, మ్యాచ్ సందర్భంగా తిలక్ వర్మ గాయపడ్డాడు. అతని పొట్ట కింది భాగంలో తీవ్రమైన గాయమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. దీంతో అతనికి శస్త్రచికిత్స పూర్తిచేశారు. ప్రస్తుతం తిలక్ వర్మ ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. అయితే, అతను కోలుకోవడానికి మూడు, నాలుగు వారాలు సమయం పడుతుందని సమాచారం. దీంతో కివీస్ జట్టుతో జరిగే టీ20 సిరీస్ కు తిలక్ వర్మ దూరమయ్యాడు. అయితే, అతని స్థానంలో జట్టులోకి ఎవరికి తీసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది.

జనవరి 21వ తేదీ నుంచి న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 21, 23, 25, 28, 31తేదీల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. న్యూజిలాండ్ తో సిరీస్ కు తిలక్ వర్మ దూరమవ్వడం భారత్ జట్టుకు బిగ్ షాకే. మరోవైపు.. టీ20 వరల్డ్ కప్ -2026 మెగాటోర్నీకి కూడా తిలక్ వర్మ దూరమయ్యే అవకాశాలున్నాయి.

టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. భారత జట్టు 7వ తేదీన యునైటెడ్ స్టేట్స్ తో తొలి మ్యాచ్ ఆడుతుంది. అయితే, అప్పటి వరకు తిలక్ వర్మ కోలుకొని పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే తుది జట్టులో చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ అతను వరల్డ్ కప్ లో ఆడినా ఆరంభంలో కొన్ని మ్యాచ్ లకు అదుబాటులో ఉండకపోవచ్చు.