Tilak Varma: అయ్యో.. తిలక్ వర్మ ఎంత పనిచేశావ్..! వేలంలో ఉండిఉంటే..

ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. వారిలో తిలక్ వర్మ ఒకరు. తిలక్ వర్మను కేవలం ..

Tilak Varma

IPL 2025 Auction : ఐపీఎల్ వేలం 2025లో ఆటగాళ్లకు కాసుల పంట పడింది. సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో ఆదివారం నిర్వహించిన తొలిరోజు వేలంలో 10 జట్లు మొత్తం 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం ప్రాంచైజీలు రూ.467.95 కోట్లు వెచ్చించాయి. అత్యధికంగా లక్నో జట్టు రిషబ్ పంత్ ను రూ. 27కోట్లకు కొనుగోలు చేయగా.. పంజాబ్ కింగ్స్ జట్టు శ్రేయాస్ అయ్యర్ ను రూ. 26.75 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో వీరిద్దరూ అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.

Also Read: IPL 2025 Auction: ఐపీఎల్ వేలంలో ప్రాంచైజీలు పెట్టిన ఖర్చు.. మిగిలిన డబ్బు ఎంతో తెలుసా..? వివరాలు ఇలా..

ముఖ్యంగా తొలిరోజు ఐపీఎల్ వేలంలో ప్రాంచైజీలు భారత్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకే ఎక్కువగా మొగ్గుచూపాయి. ఈ క్రమంలో పలువురు భారత్ ప్లేయర్లను దక్కించుకునేందుకు అత్యధిక ధర వెచ్చించాయి. వీరిలో రిషబ్ పంత్ రూ. 27కోట్లు, శ్రేయాస్ అయ్యర్ రూ.26.75కోట్లు, అర్ష్ దీప్ సింగ్ రూ.18కోట్లు, యుజ్వేంద్ర చాహల్ రూ.18కోట్లు, మహ్మద్ సిరాజ్ రూ.12.25కోట్లు, మహ్మద్ షమీ రూ.10కోట్లకు ఆయా జట్ల యాజమాన్యాలు దక్కించుకున్నాయి. హైదరాబాద్ కుర్రాడు, టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ కూడా ఐపీఎల్ వేలంలో ఉండిఉంటే.. సుమారు రూ.15 నుంచి రూ.20 కోట్లకుపైగా ధర పలికేవాడు. కానీ, తిలక్ వర్మ ను వేలంకు ముందే ముంబై ఇండియన్స్ జట్టు తక్కువ ధరతో అట్టిపెట్టుకొని ఉంది.

Also Read: IPL 2025 Auction: ఐపీఎల్ జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు.. తొలిరోజు వేలంలో దక్కించుకున్న ప్లేయర్స్ ఫుల్ లిస్ట్ ఇదే ..

ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. వారిలో తిలక్ వర్మ ఒకరు. తిలక్ వర్మను కేవలం రూ.8కోట్లకు రిటైన్ చేసుకుంది. ప్రస్తుతం తిలక్ వర్మ ఫుల్ ఫాంలో ఉన్నాడు. వరుస సెంచరీలతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇటీవల సౌతాఫ్రికా జట్టుతో జరిగిన టీ20 టోర్నీలో వర్మ రెండు సెంచరీలు చేశాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ హైదరాబాద్ కుర్రాడు వరుస సెంచరీలుచేసి ప్రపంచ టాప్ బ్యాటర్లలో ఒకడిగా నిరూపించుకున్నాడు. ఈ యువ ప్లేయర్ ప్రస్తుతం ఐపీఎల్ వేలంలో ఉండి ఉంటే.. ఫ్రాంచైజీలు తిలక్ వర్మను దక్కించుకునేందుకు రూ.20 కోట్లకుపైగా వెచ్చించేందుకుకూడా వెనుకాడకపోయేవే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ, వేలంలోకి రాకుండా తిలక్ వర్మ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిలక్ వర్మను అంటిపెట్టుకోవటం ద్వారా ముంబై ఇండియన్స్ సుమారు పది నుంచి రూ.15కోట్లు మిగిల్చుకున్నట్లయిందని తాజా వేలం తీరునుచూసి చెప్పొచ్చు.