IPL 2025 Auction: ఐపీఎల్ వేలంలో ప్రాంచైజీలు పెట్టిన ఖర్చు.. మిగిలిన డబ్బు ఎంతో తెలుసా..? వివరాలు ఇలా..

తొలిరోజు వేలంలో.. పంజాబ్ కింగ్స్ జట్టు అత్యధికంగా 10మంది ఆటగాళ్లను దక్కించుకోగా.. అత్యల్పంగా ముంబయి ఇండియన్స్ నలుగురు క్రికెటర్లను మాత్రమే దక్కించుకుంది.

IPL 2025 Auction: ఐపీఎల్ వేలంలో ప్రాంచైజీలు పెట్టిన ఖర్చు.. మిగిలిన డబ్బు ఎంతో తెలుసా..? వివరాలు ఇలా..

IPL 2025 Auction

Updated On : November 25, 2024 / 8:15 AM IST

IPL 2025 Auction Full list: ఐపీఎల్ 2025 వేలంలో ఆటగాళ్లకు కాసుల పంట పడింది. ముఖ్యంగా వేలంలో ఉన్న భారత్ ఆటగాళ్లను దక్కించుకునేందుకు ప్రాంచైజీలు పోటీపడ్డాయి. సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో ఆదివారం నిర్వహించిన తొలిరోజు వేలంలో 10 జట్లు మొత్తం 72మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం ప్రాంచైజీలు రూ.467.95 కోట్లు వెచ్చించాయి. అత్యధికంగా లక్నో జట్టు రిషబ్ పంత్ ను రూ. 27కోట్లకు కొనుగోలు చేయగా.. పంజాబ్ కింగ్స్ జట్టు శ్రేయాస్ అయ్యర్ ను రూ. 26.75 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో మొదటి, రెండు స్థానాల్లో ఖరీదైన ప్లేయర్ గా వారిద్దరూ నిలిచారు.

Also Read: IPL 2025 Auction: ఐపీఎల్ జట్లు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు.. తొలిరోజు వేలంలో దక్కించుకున్న ప్లేయర్స్ ఫుల్ లిస్ట్ ఇదే ..

తొలిరోజు.. పంజాబ్ కింగ్స్ జట్టు అత్యధికంగా 10మంది ఆటగాళ్లను దక్కించుకోగా.. అత్యల్పంగా ముంబయి ఇండియన్స్ నలుగురు క్రికెటర్లను మాత్రమే దక్కించుకుంది. ప్రాంచైజీలు ఇప్పటికే పలువురు ఆటగాళ్లను అట్టిపెట్టుకొని ఉన్నాయి. తాజాగా తొలిరోజు వేలంలో కొందరు ప్లేయర్స్ ను కొనుగోలు చేశాయి. ఈ క్రమంలో ప్రాంచైజీల వారిగా ఆటగాళ్ల కొనుగోలుకు పెట్టిన ఖర్చు ఎంత..? ఇంకా ఒక్కో జట్టు వద్ద ఎంత డబ్బు ఉందనే వివరాలు తెలుసుకుందాం.

Also Read: IPL Auction 2025 : ఐపీఎల్ వేలం.. అమ్ముడు పోయిన‌, అమ్ముడు పోని ఆట‌గాళ్ల లిస్ట్ ఇదే..

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్
పెట్టిన ఖర్చు : 89.53 కోట్లు.
మిగిలిన డబ్బులు : 30.65 కోట్లు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ..
పెట్టిన ఖర్చు : రూ. 104.40 కోట్లు.
మిగిలిన డబ్బు : రూ. 15.60 కోట్లు.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టు ..
పెట్టిన ఖర్చు : రూ. 114.85 కోట్లు.
మిగిలిన డబ్బు : రూ. 5.15 కోట్లు

ముంబై ఇండియన్స్ జట్టు..
పెట్టిన ఖర్చు : 93.90 కోట్లు.
మిగిలిన డబ్బు : 26.10 కోట్లు.

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జట్టు..
పెట్టిన ఖర్చు : రూ. 109.95కోట్లు.
మిగిలిన డబ్బు : రూ.10.05 కోట్లు.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జట్టు ..
పెట్టిన ఖర్చు : రూ.102.65 కోట్లు.
మిగిలిన డబ్బు : 17.35 కోట్లు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు..
పెట్టిన ఖర్చు : 106.20 కోట్లు.
మిగిలిన డబ్బు : రూ.13.80 కోట్లు.

పంజాబ్ కింగ్స్ జట్టు..
పెట్టిన ఖర్చు : 97.50 కోట్లు.
మిగిలిన డబ్బు : 22.50కోట్లు

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జట్టు..
పెట్టిన ఖర్చు : 105.15కోట్లు.
మిగిలిన డబ్బు : 14.85కోట్లు.

గుజ‌రాత్ టైటాన్స్ జట్టు..
పెట్టిన ఖర్చు : 102.50కోట్లు.
మిగిలిన డబ్బు : 17.50 కోట్లు.

అత్యధికంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు వద్ద రూ.30.65 కోట్లు డబ్బు మిగిలి ఉండగా.. అత్యల్పంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వద్ద రూ.5.15కోట్లు డబ్బు మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజు వేలంలో ఆయా జట్లు తమవద్ద ఉన్న డబ్బుతో మరికొందరు ఆటగాళ్లను దక్కించుకోనున్నాయి.