Tim Southee: న్యూజిలాండ్ బౌలర్ టీమ్ సౌథీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.. కానీ, ఒక్క షరతు పెట్టాడు

టీమ్ సౌథీ పేరుపై టెస్టుల్లో అనేక రికార్డులు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆరో ఆటగాడు సౌథీ. అతని ఖాతాలో మొత్తం 93 సిక్సులు ఉన్నాయి.

Tim Southee

New Zealand pacer Tim Southee: న్యూజిలాండ్ స్టార్ పేసర్, మాజీ కెప్టెన్ టీమ్ సౌథీ కీలక నిర్ణయం తీసుకున్నారు. టెస్టు ఫార్మాట్ కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్ తో స్వదేశంలో జరగనున్న సిరీస్ తరువాత టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు సౌథీ తెలిపారు. కివీస్ తరపున 104 టెస్టులు ఆడిన సౌథీ 2,185 పరుగులు చేయగా.. 385 వికెట్లు పడగొట్టాడు.

Also Read: Mohammed shami : ఆస్ట్రేలియా టూర్‌కు మహ్మద్ షమీ.. ఆ రెండు పరీక్షలు పాసైతేనే.. అవేమిటంటే.!

టీమ్ సౌథీ పేరుపై టెస్టుల్లో అనేక రికార్డులు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆరో ఆటగాడు సౌథీ. అతని ఖాతాలో మొత్తం 93 సిక్సులు ఉన్నాయి. అదేవిధంగా న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా సౌథీనే. ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్ లో మూడో టెస్టు హోమిల్టన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ తరువాత టెస్టులకు సౌథీ గుడ్ బై చెప్పనున్నాడు. ఒకవేళ న్యూజిలాండ్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరితే ఫైనల్ లో ఆడతానని తెలిపాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ జట్టు నాల్గో స్థానంలో ఉంది. ఆ జట్టు కంటే ముందు.. శ్రీలంక, ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ తో జరిగే మూడు టెస్టు మ్యాచ్ లలో విజయం సాధిస్తే న్యూజిలాండ్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ కు వెళ్లే అవకాశం ఉంది.

Also Read: IND vs AUS : ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌.. భార‌త్ జ‌ట్టుకు బిగ్‌షాక్‌..!

టెస్టు ఫార్మాట్ కు రిటైర్మెంట్ విషయంపై సౌథీ మాట్లాడాడు. చిన్నప్పటి నుంచి న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలతో పెరుగుతూ వచ్చాయని.. నా కల సాకారం చేసుకోవటంతోపాటు.. ఎంతో మంది మనస్సులను గెలుచుకున్నానని పేర్కొన్నాడు. నా టెస్టు కెరీర్ ప్రారంభమైన జట్టుపైనే చివరి మ్యాచ్ ఆడబోతుండటం సంతోషంగా ఉందని అన్నాడు. నాకు ఇష్టమైన స్టేడియంలలో హోమిల్టన్ ఒకటి. ఆ మైదానంలో నేను చివరి టెస్టు ఆడబోతున్నానని సౌథీ పేర్కొన్నాడు.