Timed out in cricket : క్రికెట్‌లో టైమ్డ్ ఔట్ అంటే ఏమిటి..? బ్యాట‌ర్‌ను ఇలా ఔట్ చేయొచ్చా..?

సాధార‌ణంగా క్రికెట్ గురించి కాస్త ప‌రిజ్ఞానం ఉన్న ఎవ్వ‌రికి అయినా స‌రే బ్యాట‌ర్లు ఎలా ఔట్ అవుతారు అన్న సంగ‌తి తెలిసే ఉంటుంది.

Timed out

Timed out : సాధార‌ణంగా క్రికెట్ గురించి కాస్త ప‌రిజ్ఞానం ఉన్న ఎవ్వ‌రికి అయినా స‌రే బ్యాట‌ర్లు ఎలా ఔట్ అవుతారు అన్న సంగ‌తి తెలిసే ఉంటుంది. క్యాచ్‌, బౌల్డ్‌, ఎల్బీ లేదంటే ర‌నౌట్ గా బ్యాట‌ర్లు ఔట్ అవుతుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం హిట్ వికెట్ రూపంలో పెవిలియ‌న్‌కు చేర‌డాన్ని చూస్తూనే ఉంటాం. టైమ్డ్ ఔట్ అనేది ఒక‌టి ఉంటుంద‌ని చాలా మందికి తెలియ‌దు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట‌ర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్ అయిన మొద‌టి బ్యాట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. దీన్ని చూసిన వారు ఇస‌లు ఇలా కూడా బ్యాట‌ర్ ను ఔట్ ఇస్తారా..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

అస‌లు టైమ్డ్ ఔట్ అంటే ఏమిటి..?

క్రీజులో ఉన్న బ్యాట‌ర్ ఔట్ అయిన త‌రువాత కొత్త‌గా వ‌చ్చే బ్యాట‌ర్ నిర్ణీత స‌మ‌యంలోగా క్రీజులోకి రాక‌పోతే కొత్త‌గా వ‌చ్చే బ్యాట‌ర్‌ను ఔట్‌గా ప‌రిగ‌ణిస్తారు దీన్నే టైమ్డ్ ఔట్ అంటారు. ఎంసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఓ బ్యాట‌ర్ ఔట్ అయిన త‌రువాత మూడు నిమిషాల్లోపు కొత్త‌గా వ‌చ్చే బ్యాట‌ర్ క్రీజులోకి వ‌చ్చి బంతిని ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. అలా కానీ ప‌క్షంలో కొత్త‌గా వ‌చ్చే బ్యాట‌ర్‌గా టైమ్డ్ ఔట్‌గా ప్రక‌టించ‌వ‌చ్చు.

ODI World Cup 2023 : ర‌స‌వ‌త్త‌రంగా సెమీస్ రేసు.. రెండు స్థానాల కోసం నాలుగు జ‌ట్ల పోటీ.. ఏ జ‌ట్లు సెమీస్ చేరుతాయంటే..?

ఇలా ఔటైన తొలి బ్యాట‌ర్ మాథ్యూస్‌..

శ్రీలంక బ్యాట‌ర్ స‌దీర స‌మ‌ర‌విక్ర‌మ ఔట్ కావ‌డంతో మాథ్యూస్ క్రీజులో రావాల్సి ఉంది. మైదానంలోకి స‌గం దూరం వ‌చ్చిన త‌రువాత మాథ్యూస్ తాను త‌ప్పుడు హెల్మెట్ తెచ్చుకున్న‌ట్లు గుర్తించాడు. వెంట‌నే అత‌డు డ్రెస్సింగ్ రూమ్ సిబ్బందికి సైగ చేసి కొత్త హెల్మెట్‌ను తెప్పించుకున్నాడు. అప్ప‌టి వ‌ర‌కు అత‌డు క్రీజును చేర‌లేదు. మైదానం మ‌ధ్య‌లోనే ఉన్నాడు. దీంతో బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు మాథ్యూస్ ఔట్ అంటూ అంపైర్‌కు అప్పీల్ చేశారు.

తాను త‌ప్పుడు హెల్మెట్ తెచ్చుకోవ‌డంతో క్రీజులోకి రాలేద‌ని, మాథ్యూస్ అంపైర్లు, బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కీబ్‌, ఆట‌గాళ్లకు చెప్పాడు. అత‌డు ఎంత‌గా న‌చ్చ‌జెప్పిన‌ప్ప‌టికి బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కీబ్ అప్పీల్‌ను వెన‌క్కి తీసుకోలేదు. నిబంధ‌న‌లు పాటించిన అంపైర్లు మాథ్యూస్‌ను టైమ్డ్ ఔట్‌గా ప్ర‌క‌టించారు. దీంతో మాథ్యూస్ నిరాశ‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ప్ర‌స్తుతం మాథ్యూస్ ఔటైన విదానంపై క్రీడా వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది.

ODI World Cup 2023 : పాకిస్థాన్‌కు వ‌ర్షం సాయం చేస్తే.. ఐసీసీ షాకిచ్చింది

ట్రెండింగ్ వార్తలు