Virat Kohli: కోహ్లీని మొదటిసారి కలిసినప్పుడే అలాంటివి వద్దని చెప్పా – సచిన్

క్రికెట్ అభిమానులా.. కాదా అనేది పక్కకుపెడితే యావత్ దేశమంతా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల పేర్లు వినే ఉంటారు. టీమిండియా క్రికెట్ లో లెజెండ్ ...

Virat Kohli: కోహ్లీని మొదటిసారి కలిసినప్పుడే అలాంటివి వద్దని చెప్పా – సచిన్

Virat Kohli

Virat Kohli: క్రికెట్ అభిమానులా.. కాదా అనేది పక్కకుపెడితే యావత్ దేశమంతా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల పేర్లు వినే ఉంటారు. టీమిండియా క్రికెట్ లో లెజెండ్ సచిన్ టెండూల్కర్. ప్రొఫెషనల్ కెరీర్లో అద్భుతమైన ఆటతీరుతో ఎన్నో రికార్డులు బ్రేక్ చేశాడు. తన రిటైర్మెంట్ తర్వాత టీమిండియాకు మళ్లీ అలాంటి ప్లేయర్ వస్తాడా అని చూస్తుండగానే విరాట్ కోహ్లీ ఎదిగాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ లో సచిన్ రికార్డులను బ్రేక్ చేసే స్థాయికి ఎదిగిన విరాట్ గురించి.. సచిన్ మొదటిసారిగా కలిసిన సందర్భం గురించి ప్రస్తావించాడు. లెజెండ్స్ విత్ అన్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

యువరాజ్ సింగ్, మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్ లు యువ క్రికెటర్లు ఎవరొచ్చినా.. కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు టెండూల్కర్ కాళ్లకు నమస్కరించి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పారట.

‘ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఏం చేస్తున్నావని అడిగా. కెరీర్లో సాధించడానికి ఇలాంటివేమీ చేయనవసర్లేదని చెప్పా. అప్పుడు లేచి వాళ్ల వంకే చూస్తున్నాడు. వాళ్లేమో విరాట్ ను చూసి నవ్వుతున్నారు’ అని టెండూల్కర్ అప్పటి ఘటనలను గుర్తు చేసుకున్నారు.