Tollywood Pro League: హైదరాబాద్ వేదికగా టాలీవుడ్ ప్రో లీగ్ (TPL) ప్రారంభమైంది. ఈబీజీ గ్రూప్ ఆధ్వర్యంలో సరికొత్త క్రికెట్ లీగ్ జరుగుతోంది. నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ఈ లీగ్ ప్రారంభమైంది. టాలీవుడ్ ప్రో లీగ్‌కు హానరరీ చైర్మన్‌గా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. క్రికెట్-సినిమా కలయికగా టీపీఎల్ నిర్వహిస్తున్నారు.
ముఖ్య అతిథులుగా కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా హాజరయ్యారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. కికెట్ టీమ్‌లో టాలీవుడ్ సెలబ్రిటీ ఆటగాళ్లు, టీమ్ ఓనర్లుగా నిర్మాతలు ఉన్నారు.
ఆరు జట్లతో ఫ్రాంచైజీ లీగ్‌గా టీపీఎల్ నిర్వహిస్తున్నారు. ఏడాదికి రెండు సీజన్లు నిర్వహిస్తారు. క్రికెట్‌తో పాటు వినోద కార్యక్రమాలు ఉంటాయి. ప్రత్యేక ఆకర్షణగా డిజిటల్ కంటెంట్, ఫ్యాన్ జోన్లు ఉండనున్నాయి.
టాలీవుడ్ ఐక్యతే లక్ష్యంగా టీపీఎల్ నిర్వహిస్తున్నామని దిల్ రాజు అన్నారు. సినీ పరిశ్రమలో ప్రతి వృత్తికి ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. ‘అలై బలై’ ఇన్‌క్లూజన్ ఈ కాన్సెప్ట్ ప్రత్యేకత అని అన్నారు. టాలీవుడ్ సంక్షేమానికి ఆదాయంలో భాగం ఉంటుందని చెప్పారు.