DC vs SRH : స‌న్‌రైజ‌ర్స్ బ్యాటింగ్ పై ఫ‌న్నీ మీమ్స్‌.. బ్లూ జెర్సీ చూస్తే హెడ్‌కు పూన‌కం

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అద‌ర‌గొడుతోంది.

Top 10 funny memes after SRH reached 266_7 in IPL 2024 clash vs DC

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అద‌ర‌గొడుతోంది. బంతి ప‌డ‌డ‌మే ఆల‌స్యం బౌండ‌రీకి త‌ర‌లిస్తున్నారు ఆ జ‌ట్టు బ్యాట‌ర్లు. నువ్వు ఫోర్ కొడితే నేను సిక్స్ కొడ‌గా అన్న చందంగా ఆ జ‌ట్టు ఓపెన‌ర్ల తీరు సాగుతోంది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ మాత్రం బంతి పై ఏదో ప‌గ ఉన్న‌ట్లుగా క‌సితీరా కొడుతున్నాడు. ఈ సీజ‌న్‌లో మూడో సారి 250 ఫ్ల‌స్ స్కోరును న‌మోదు చేసింది హైద‌రాబాద్‌.

శ‌నివారం ఢిల్లీ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్లో ఏడు వికెట్ల న‌ష్టానికి 266 ప‌రుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (89; 32 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), షాబాద్ అహ్మ‌ద్‌( 59నాటౌట్; 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు), అభిషేక్ శ‌ర్మ (46; 12 బంతుల్లో 2 ఫోర్లు, 6సిక్స‌ర్లు) దూకుడుగా ఆడారు. ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 19.1 ఓవ‌ర్ల‌లో 199 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో హైద‌రాబాద్ 67 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

ఇదిలా ఉంటే.. ఢిల్లీతో మ్యాచ్‌లో హైద‌రాబాద్ బ్యాటింగ్ నెక్ట్ లెవల్ అని చెప్పాలి. ప‌వ‌ర్ ప్లే ఆరు ఓవ‌ర్లో వికెట్ న‌ష్ట‌పోకుండా 125 ప‌రుగులు చేసింది. పురుషుల టీ20 క్రికెట్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఇదే అత్య‌ధిక స్కోరు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాటింగ్ పై సోష‌ల్ మీడియాలో మీమ్స్ వైర‌ల్ అవుతున్నాయి. అవేంటో మీరు ఓ సారి చూసేయండి.

RCB : ఆర్‌సీబీకి ఇంకా ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు ఉన్నాయా? ఇలాంటి అద్భుతం జ‌రిగితే త‌ప్పా..!

ట్రెండింగ్ వార్తలు