TOPLESS
FIFA World Cup2022: ఖతర్ వేదికగా ఫిపా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 4-2తో ఫ్రాన్స్ జట్టుపై విజయం సాధించింది. దీంతో అర్జెంటీనా మూడవ సారి వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. అర్జెంటీనా విజయంతో స్టేడియం మొత్తం సంబరాలు అంబరాన్నంటాయి. అర్జెంటీనా క్రీడాకారులతో పాటు, అభిమానులు అరుపులు, డ్యాన్స్ లతో సందడి చేశారు. మెస్సీ.. మెస్సీ అనే నామంతో స్టేడియం ప్రాంతాలన్నీ మారుమోగిపోయాయి. ఈ సమయంలో ఓ మహిళ టాప్ లెస్ తో సంబరాల్లో పాల్గొంది.
FIFA World Cup 2022: 1500 బిర్యానీలు ఉచితంగా పంచిన కేరళ వ్యాపారి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
స్టేడియంలో అర్జెంటీనా మద్దతుదారుల సంబురాలు జరుగుతున్న సమయంలో స్టేడియంలోకి ఓ మహిళ టాప్‌లెస్ గా గ్రౌండ్ లోకి వచ్చింది. ఈ దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ఆమె ఎలాంటి బెరుకు లేకుండా అర్జెంటీనా మద్దతుదారులతో కలిసి చిందులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ మహిళ కావాలనే అలా చేసిందా? లేకుంటే అనుకోకుండా ఆమె టాప్ డ్రస్సు ఊడిపోయిందా అనేది తెలియాల్సి ఉంది.
Fifa World Cup-2022: ఫ్రాన్స్, అర్జెంటీనా ఫుట్‌బాల్ షర్టులు ధరించి పెళ్లి చేసుకున్న అమ్మాయి, అబ్బాయి
మహిళ టాప్ లెస్‌తో గ్రౌండ్‌లోకి రావడాన్ని గమనించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆమెకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా భద్రతా వలయంలో ఆమెను గ్రౌండ్ వెలుపలకు తీసుకెళ్లారు. అయితే, ఎక్కువ మంది ఈ మహిళను గమనించలేదు. సంబరాల్లో మునిగితేలడంతో పాటు మెస్సీ మెస్సీ అనే నామజపంతో గ్రౌండ్ మొత్తం హోరెత్తి పోయింది. అయితే కొందరు ఆమె చర్యతో ఆశ్చర్యపోయారు. అక్కడే ఉంటే ఆమె ప్రాణాలకు ప్రమాదం పొంచిఉంటుందని భావించిన భద్రతా సిబ్బంది ఆమె చుట్టూ టవల్స్ ను కప్పి ఆమెను సురక్షిత ప్రదేశానికి పంపించారు. మహిళ చర్యను ఖతర్ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆమె ఎక్కడ ఉన్నా నోటీసులిస్తామని, దానికి ఆమె బదులు ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు.