Travis Head Creates history Fewest innings to 3000 ODI runs for Australia
Travis Head : ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. సిడ్నీ వేదికగా భారత్‌తో మూడో వన్డే మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 22 పరుగుల వద్ద అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 3వేల వన్డే పరుగులు సాధించిన ఆస్ట్రేలియా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఈ క్రమంలో అతడు స్టీవ్ స్మిత్ ను అధిగమించాడు. వన్డేల్లో 79 ఇన్నింగ్స్‌ల్లో స్మిత్ 3 వేల పరుగులు చేయగా.. హెడ్ (Travis Head ) కేవలం 76 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.
వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 3వేల పరుగులు చేసిన ఆసీస్ ప్లేయర్లు వీరే..
* ట్రావిస్ హెడ్ – 76 ఇన్నింగ్స్‌ల్లో
* స్టీవ్ స్మిత్ – 79 ఇన్నింగ్స్‌ల్లో
* మైఖేల్ బెవాన్ – 80 ఇన్నింగ్స్‌ల్లో
* జార్జ్ బెయిలీ – 80 ఇన్నింగ్స్‌ల్లో
* డేవిడ్ వార్నర్ – 81 ఇన్నింగ్స్‌ల్లో
Womens World Cup 2025 : సెమీస్ చేరుకున్న భారత్.. ప్రత్యర్థి ఎవరో తెలుసా?
బంతుల పరంగా నాలుగో స్థానంలో..
ఇక ఓవరాల్‌గా బంతుల పరంగా వన్డేల్లో అత్యంత వేగంగా 3వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు ట్రావిస్ హెడ్. ఈ జాబితాలో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత స్థానాల్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు జోస్ బట్లర్, జేసన్ రాయ్ లు ఉన్నారు.
వన్డేల్లో బంతుల పరంగా అత్యంత వేగంగా మూడు వేల పరుగులు చేసిన ఆటగాళ్లు..
* గ్లెన్ మాక్స్‌వెల్ – 2440 బంతుల్లో
* జోస్ బట్లర్ – 2533 బంతుల్లో
* జేసన్ రాయ్ -2820 బంతుల్లో
* ట్రావిస్ హెడ్ – 2839 బంతుల్లో
* జానీ బెయిర్ స్టో – 2842 బంతుల్లో
ఇక ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ 25 బంతులు ఎదుర్కొన్నాడు. 6 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.