IND vs ENG : క్రికెట్ అభిమానుల‌కు టీఎస్‌ఆర్టీసీ శుభ‌వార్త‌.. ఉప్ప‌ల్‌లో మ్యాచ్ చూడాల‌నుకునే వారికే..

గురువారం నుంచి హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మొద‌టి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

TSRTC to run 60 special buses for Uppal Test match

IND vs ENG : ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌ (డ‌బ్ల్యూటీసీ) 2023-2025 సైకిల్ లో ఫైన‌ల్‌కు చేరుకోవాలంటే ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ భార‌త్‌కు ఎంతో కీల‌కం. ఈ క్ర‌మంలో గురువారం నుంచి హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మొద‌టి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. చాలా రోజుల త‌రువాత ఉప్ప‌ల్ మైదానం టెస్టుల‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ క్ర‌మంలో ఈ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించాల‌ని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో క్రికెట్ అభిమానుల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ ఆర్టీసీ) శుభ‌వార్త చెప్పింది.

హైద‌రాబాద్ న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల నుంచి మ్యాచ్ జ‌రిగే ఉప్ప‌ల్ స్టేడియానికి 60 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు వెల్లడించింది. మ్యాచ్ జ‌రిగే ఐదు రోజుల పాటు ఈ బ‌స్సులు న‌డ‌వ‌నున్నాయి. ఈ బ‌స్సులు ప్ర‌తి రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతాయ‌న్నారు. అనంత‌రం రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు స్టేడియం నుంచి ఈ బ‌స్సులు బ‌య‌లుదేర‌నున్నాయి. మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా చూడాల‌నే ఫ్యాన్స్ ఈ ప్ర‌త్యేక బ‌స్సుల స‌ర్వీస్‌ను ఉప‌యోగించుకోవాల‌ని టీఎస్‌ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ విజ్ఞ‌ప్తి చేశారు.

భారత్, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్.. ఉదయం 6.30 నుంచే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతి

బ‌స్సుల రూట్‌ల వివ‌రాలు ఇవే..

IND vs ENG : ఇంగ్లాండ్‌తో టెస్టులు.. కోహ్లీ స్థానంలో ఆర్‌సీబీ ప్లేయ‌ర్‌కే ఛాన్స్‌..!

ట్రెండింగ్ వార్తలు