Site icon 10TV Telugu

ఎవర్రా సామీ నువ్వు.. సిక్సులు, ఫోర్లతో విధ్వంసం.. 29 బంతుల్లోనే సెంచరీ.. 71 బంతుల్లో 200 పరుగులు.. ఏమన్నా కొట్టుడా.. చివర్లో బిగ్ ట్విస్ట్

Muhammad Fahad

Muhammad Fahad

Muhammad Fahad 29 ball century: బల్గేరియాలో జరుగుతున్న టీ20 ముక్కోణపు సిరీస్‌లో టర్కీ, బల్గేరియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. రికార్డుల మోత మోగింది. టర్కీ ఓపెనర్ మొహమ్మద్ ఫహాద్ పూనకం వచ్చినట్లుగా ఫోర్లు, సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. బౌలర్లకు చెమటలు పట్టించాడు. కేవలం 29 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాడు. తద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్ గా రికార్డు నమోదు చేశాడు.

Also Raed: ఓరి వీళ్ల వేషాలో.. చివరి ఓవర్లో పెద్ద డ్రామా ఆడిన ఇంగ్లాండ్ ఓపెనర్లు.. శుభ్‌మన్‌ గిల్‌కు చిర్రెత్తుకొచ్చి ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్

సోఫియాలోని నేషనల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఈ మ్యాచ్‌లో టర్కీ టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ మొహమ్మద్ ఫహాద్ మ్యాచ్ ప్రారంభం నుంచి బల్గేరియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో వీరవిహారం చేశాడు. ఈ క్రమంలో 29 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫహాద్ మొత్తం 34 బంతులు ఎదుర్కొని 120 పరుగులు చేశాడు. కేవలం 11.5ఓవర్లలోనే టర్కీ స్కోర్ 200 మార్కును దాటింది. ఇది టీ20 క్రికెట్ లో అత్యంత వేగవంతమైన 200 పరుగుల రికార్డు.


అయితే, ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. 12.1 ఓవర్లలో 205/1 స్కోర్ చేసిన టర్కీ.. తరువాతి ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో 19.3 ఓవర్లలో 237 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. భారీ లక్ష్య ఛేదనకోసం బ్యాటింగ్ ప్రారంభించిన బల్గేరియా జట్టు.. టార్గెట్‌ను చేరుకోలేకపోయింది. మిడిల్ ఆర్డర్ ఒత్తిడికి లోనైంది. దీంతో వరుసగా వికెట్లు కోల్పోవటంతో బల్గేరియా జట్టు 178 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టర్కీ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాటర్లు వీరే..
♦ సాహిల్ చౌహాన్ – 27 బంతులు
♦ మొహమ్మద్ ఫహాద్ – 29 బంతులు
♦ జాన్ నికెల్ లాఫ్టీ ఈటన్ – 33 బంతులు
♦ సికందర్ రజా – 33 బంతులు
♦ కుశాల్ మల్లా – 34 బంతులు

 

Exit mobile version